Keedaa Cola : ఈ నగరానికి ఏమైంది రీ రిలీజ్.. కీడా కోలా టీజర్.. అప్డేట్స్ ఇచ్చిన తరుణ్ భాస్కర్!

ఈ నగరానికి ఏమైంది సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకోని తరుణ్ భాస్కర్ ‘కీడా కోలా’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. అలాగే ఈ నగరానికి ఏమైంది రీ రిలీజ్ కూడా..

Tharun Bhascker gave updates on Keedaa Cola Ee Nagaraniki Emaindi

Keedaa Cola – Ee Nagaraniki Emaindi : టాలీవుడ్ లో పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్. 2018లో వచ్చిన ఈ నగరానికి ఏమైంది సినిమా తరువాత దర్శకుడిగా మరో సినిమాని ఇప్పటివరకు తీసుకు రాలేదు. అప్పటి నుంచి పలు సినిమాల్లో నటుడిగా కనిపిస్తూ వస్తున్న ఈ దర్శకుడు.. ఇటీవలే ఒక సినిమా ప్రకటించాడు. ‘కీడా కోలా’ అనే కొత్త టైటిల్ ని పెట్టి కొత్త కాన్సెప్ట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్నాడు.

Chiranjeevi : చిరంజీవి క్యాన్సర్ టెస్ట్ క్యాంప్ సెంటర్స్.. ఆంధ్రా-తెలంగాణలో ఏర్పాట్లు..

కీడా అంటే బొద్దింక అని అర్ధం. రాజమౌళి ఈగతో యాక్షన్ సన్నివేశాలు చేయించి అలరిస్తే.. తరుణ్ బొద్దింకతో కామెడీ చేయించి ఎంటర్టైన్ చేస్తాను అంటున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీలో అందరూ కొత్తవాళ్లే నటించబోతున్నారు. అయితే కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం మాత్రం ఒక స్పెషల్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఇక ఈ మూవీ టీజర్ ని జూన్ 28న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మరి బొద్దింకతో తరుణ్ భాస్కర్ ఏమి కామెడీ చేయిస్తాడో చూడాలి.

Tharun Bhascker gave updates on Keedaa Cola Ee Nagaraniki Emaindi

ఇక ప్రస్తుతం రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తుండడంతో ప్రేక్షకులంతా ఈ నగరానికి ఏమైంది సినిమా రీ రిలీజ్ ని ఎప్పటి నుంచో అడుగుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని జూన్ 29న కొన్ని ఎంపిక చేసిన థియేటర్స్ లోనే రీ రిలీజ్ చేయబోతున్నారు. అయితే కేవలం థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తే అది తరుణ్ భాస్కర్ ఎందుకు అవుతాడు. ఏదైనా కేజ్రీగా చేయడంలో ఈ దర్శకుడికి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ క్రేజీ థింకింగ్ తోనే ఈ సినిమాని కొన్ని ఎంపిక చేసిన క్ల‌బ్స్ అండ్ కెఫేల‌లో కూడా విడుద‌ల చేయనున్నారు.