Tharun Bhaskar : టికెట్ రేట్లు పెద్ద సమస్య కాదు.. టాలీవుడ్ సమస్యలపై 10 టీవీతో మాట్లాడిన తరుణ్ భాస్కర్

తాజాగా టాలీవుడ్ సమస్యలపై దర్శకుడు తరుణ్ భాస్కర్ 10 టీవీతో మాట్లాడారు. ''టాలీవుడ్ లో ఇలాంటి సమస్యలు రావడానికి ముఖ్య కారణం కరోనానే. అలాగే ఓటీటీ కూడా. పెద్ద సినిమా అయితేనే థియేటర్స్ కి వెళ్తున్నారు. చిన్న సినిమా అయితే.........

Tharun Bhaskar : టికెట్ రేట్లు పెద్ద సమస్య కాదు.. టాలీవుడ్ సమస్యలపై 10 టీవీతో మాట్లాడిన తరుణ్ భాస్కర్

Tharun Bhaskar

Updated On : July 30, 2022 / 7:20 AM IST

Tharun Bhaskar :  గత కొద్ది రోజులుగా టాలీవుడ్ పరిశ్రమ సమస్యల వలయంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. థియేటర్స్ కి జనాలు రాకపోవడం, ఓటీటీ, టికెట్ రేట్లు, హీరోలు, ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు, టాలీవుడ్ అంతర్గత సమస్యలు.. ఇలా చాలా సమస్యలతో సతమతమవుతోంది. దీనిపై ఇటీవల వరుసగా నిర్మాతల మండలి, ఫిలిం ఛాంబర్, టాలీవుడ్ పెద్దలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమస్యలకి పలు పరిష్కారాలు ప్రతిపాదించారు. వాటిపై ఒక నిర్ణయం వచ్చేవరకు షూటింగ్స్ కూడా బంద్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో టాలీవుడ్ సమస్యలపై ఒక్కొక్కరు తమ అభిప్రాయాలని వెల్లడిస్తున్నారు.

తాజాగా టాలీవుడ్ సమస్యలపై దర్శకుడు తరుణ్ భాస్కర్ 10 టీవీతో మాట్లాడారు. ”టాలీవుడ్ లో ఇలాంటి సమస్యలు రావడానికి ముఖ్య కారణం కరోనానే. అలాగే ఓటీటీ కూడా. పెద్ద సినిమా అయితేనే థియేటర్స్ కి వెళ్తున్నారు. చిన్న సినిమా అయితే థియేటర్స్ కి వెళ్లట్లేదు, ఓటీటీలో వస్తుంది కదా అని భావిస్తున్నారు ప్రేక్షకులు. ఓటీటీ వచ్చాక ప్రేక్షకుల్లో సినిమా చూసే స్థాయి పెరిగింది. ఇంటర్నేషనల్ సినిమాలు కూడా మనకి అందుబాటులో ఉంటున్నాయి. దానికి తగ్గట్టు మనం కంటెంట్ ని రాసుకోవాలి. నాకు నచ్చిన సినిమాలు కొన్ని ఫ్లాప్ అయ్యాయి. నాకు నచ్చని సినిమాలు కొన్ని హిట్ అయ్యాయి. టికెట్ రేట్లు ఈ సమస్యలకి కారణం అని నేను అనుకోను. జనాల్లో స్పెండింగ్ కెపాసిటీ పెరిగింది. ఈ టికెట్ రేట్లతో ప్రాబ్లమ్ లేదు” అని అన్నారు.

Kalyan Ram : మా పిల్లలకు ట్యూషన్‌ చెప్పడానికి వచ్చి ఈ సినిమాకి డైలాగ్ రైటర్ అయ్యారు

ఒక వైపు అంతా టికెట్ రేట్ల వల్లే జనాలు థియేటర్ కి రావట్లేదు అంటుంటే తరుణ్ భాస్కట్ టికెట్ రేట్లతో ప్రాబ్లమ్ లేదు అనడంతో ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.