Kalyan Ram : మా పిల్లలకు ట్యూషన్‌ చెప్పడానికి వచ్చి ఈ సినిమాకి డైలాగ్ రైటర్ అయ్యారు

ప్రీ రిలీజ్‌ వేడుకలో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. ఒక మంచి జానపద, రాజుల కాలం నాటి సినిమాను మీ ముందుకు తీసుకురావాలనుకున్నాను. అలాంటి ప్రయత్నమే ఈ బింబిసార. ఈసారి మాత్రం ఎవరినీ డిసప్పాయింట్‌ చేయను.

Kalyan Ram : మా పిల్లలకు ట్యూషన్‌ చెప్పడానికి వచ్చి ఈ సినిమాకి డైలాగ్ రైటర్ అయ్యారు

Bimbisara

Bimbisara :  కల్యాణ్‌ రామ్‌ హీరోగా, కేథరిన్, సంయుక్తా మీనన్‌ హీరోయిన్స్ గా నటించిన సినిమా ‘బింబిసార’. వశిష్ఠ్‌ దర్శకత్వంలో నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 5న విడుదల కానుంది. శుక్రవారం సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. దీనికి ముఖ్య అతిధిగా ఎన్టీఆర్ వచ్చారు.

Jr NTR : థియేటర్లకి జనాలు రావడం లేదని అంటున్నారు.. నేను నమ్మను..

ఈ ప్రీ రిలీజ్‌ వేడుకలో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ముందుగా సినిమాలో పని చేసిన నటీనటులకు, సినిమాకి పని చేసిన టెక్నీషియన్స్ కి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత..”ఒక మంచి జానపద, రాజుల కాలం నాటి సినిమాను మీ ముందుకు తీసుకురావాలనుకున్నాను. అలాంటి ప్రయత్నమే ఈ బింబిసార. ఈసారి మాత్రం ఎవరినీ డిసప్పాయింట్‌ చేయను. 200 శాతం మీరందరూ సంతృప్తి చెందుతారు, గర్వంగా ఫీలవుతారు. తెలుగు సినిమాకు మూలకారకుడైన మా తాతగారు నందమూరి తారకరామారావుగారికి ఈ చిత్రాన్ని అంకితం చేస్తున్నా. ఈ సినిమాకు మాటలు రాసిన వాసుదేవ్‌ మా పిల్లలకు ట్యూషన్‌ చెప్పడానికి వచ్చాడు. తర్వాత ఈ సినిమాకి డైలాగ్‌ రైటర్‌ అయ్యాడు. నా తమ్ముడు ఎన్టీఆర్ కి నేను థ్యాంక్స్ చెప్పను. లవ్ యు చెప్తాను. మా ఇద్దరి మధ్య మంచి బంధం ఉంది” అని అన్నారు.