That director forced me to kiss him_ Mouni Roy shocking comments
Mouni Roy: నాగిని సీరియల్ చాలా మందికి గుర్తుండే ఉంటుంది. హిందీలో టెలికాస్ట్ అయినా ఈ సీరియల్ చాలా పాపులర్ అయ్యింది. అయితే ఈ సీరియల్ లో హీరో, హీరోయిన్స్ చేసిన వాళ్ళను ఎవరు గుర్తుపట్టక పోవచ్చు కానీ, విలన్ గా చేసిన నటి మాత్రం అందరికీ గుర్తు ఉంటుంది. అంతలా తన నటనతో పాపులర్ అయ్యింది ఆ బ్యూటీ. తనే నటి మౌనీ రాయ్(Mouni Roy). ఆ తరువాత అదే ఫేమ్ తో సినిమాలోకి కూడా అడుగుపెట్టింది. అయితే, తాను సినిమాల్లో అవకాశాల కోసం ట్రై చేస్తున్నప్పుడు జరిగిన ఒక చేదు సంఘటన గురించి ఆమె ఇటీవల వివరించింది.
G.O.A.T: G.O.A.T మూవీ నుంచి “ఒడియమ్మ” సాంగ్.. లవ్ మెలోడీతో అదరగొట్టేసిన సుధీర్
ఇటీవల ఈ అమ్మడు ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యింది. ఆ ఇంటర్వ్యూ ఆమె మాట్లాడుతూ.. నేను 21 ఏళ్ళ వయసు నుంచే సినిమా అవకాశాల కోసం ఆఫీస్ ల చుట్టూ తిరిగాను. ఆ సమయంలో ఒక దర్శకుడు అవకాశం ఇస్తాను అంటూ ఆఫీస్ కి రమ్మన్నాడు. నేను వెళ్ళాను. కానీ, ఆయన కథను వివరిస్తూ హఠాత్తుగా నాకు ముద్దు పెట్టుకున్నాడు. నాకు చాలా భయం వేసింది. ఆ ఘటన నన్ను చాలా కాలం వెంటాడింది. ఆ తరువాత కూడా ఎన్నో అవమానాలు, అనుభవాలు, విమర్శలు, ఎదుర్కొన్నాను. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను. నిజానికి అలాంటి దర్శకులను చాలా మందిని చూశాను. కానీ, భయపడలేదు. నా ప్రతిభను, కష్టాన్ని నమ్ముకున్నాను”అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. దీంతో ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక మౌనీ రాయ్ విషయానికి వస్తే, త్వరలోనే ఆమె టాలీవుడ్ లో అడుగుపెట్టనుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న విశ్వంభర సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తుంది ఈ అమ్మడు. భీమ్స్ కంపోజ్ చేసిన ఈ మాస్ సాంగ్ షూటింగ్ కూడా ఇటీవలే కంప్లీట్ అయ్యింది. 2026 సమ్మర్ కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.