G.O.A.T: G.O.A.T మూవీ నుంచి “ఒడియమ్మ” సాంగ్.. లవ్ మెలోడీతో అదరగొట్టేసిన సుధీర్

సుడిగాలి సుధీర్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ G.O.A.T(గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం)(G.O.A.T). జైశ్నవ్ ప్రొడక్షన్ , మాహాతేజ క్రియేషన్స్ లో మొగుళ్ళ చంద్రశేఖర్ గారి నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో దివ్యభారతి హీరోయిన్ గా నటిస్తోంది.

G.O.A.T: G.O.A.T మూవీ నుంచి “ఒడియమ్మ” సాంగ్.. లవ్ మెలోడీతో అదరగొట్టేసిన సుధీర్

Odiyamma song released from Sudigali Sudheer's G.O.A.T movie

Updated On : November 21, 2025 / 7:02 AM IST

G.O.A.T: సుడిగాలి సుధీర్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ G.O.A.T(గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం)(G.O.A.T). జైశ్నవ్ ప్రొడక్షన్ , మాహాతేజ క్రియేషన్స్ లో మొగుళ్ళ చంద్రశేఖర్ గారి నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో దివ్యభారతి హీరోయిన్ గా నటిస్తోంది. క్రికెట్ నేపధ్యంలో కామెడీ ప్రధాణంగా వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీంతో చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ “ఒడియమ్మ” అనే పాటను విడుదల చేశారు. ఈ పాటను ప్రముఖ తమిళ సంగీత దర్శకులు జీవి ప్రకాష్ కుమార్ లాంచ్ చేశారు. లియోన్ జేమ్స్ ఈ పాటను అదిరిపోయే లవ్ మెలోడీ గా కంపోజ్ చేశారు. అనురాగ్ కులకర్ణి ఎనర్జిటిక్ వాయిస్ ఈ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. సురేష్ బనిసెట్టి లిరిక్స్ హీరో ఎమోషన్స్ ని అద్భుతంగా ప్రజెంట్ చేశాయి. దీంతో ఇప్పుడు ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి లేట్ ఎందుకు ఆ లవ్ మెలోడీ సాంగ్ విని మీరు కూడా ఎంజాయ్ చేయండి.

Varanasi: వారణాసి నుంచి క్రేజీ న్యూస్.. హనుమంతుడిగా తమిళ హీరో.. తెలుగులో ఎవరు చేయలేరా..