Vivek Oberoi : సంపాదనలో ఆ స్టార్ హీరోలనే వెనక్కి నెట్టిన బాలీవుడ్ నటుడు.. అన్ని కోట్లకు అధిపతా
సంపాదనలో ఆ స్టార్ హీరోలనే వెనక్కి నెట్టిన బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్.

The Bollywood actor Vivek Oberoi who earned more then that star heroes
Vivek Oberoi : బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ లో పలు సినిమాలు చేసిన ఆయన టాలీవుడ్, మాలీవుడ్ లో కూడా సినిమాలు చేసారు. అలా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఈ నటుడు. కొన్ని సినిమాలు చేసి బాగానే ఆస్తులు కూడా కూడబెట్టారు. అయితే తాజాగా తెలిసిన విషయం ఏంటంటే వివేక్ ఒబెరాయ్ ఆస్తులు కూడబెట్టడంలో చాలా మంది స్టార్ హీరోలని కూడా వెనక్కి నెట్టేశారట.
వివేక్ ఒబెరాయ్ ఆస్తులు విలువ 1200 కోట్లకి పైమాటే అని తెలుస్తుంది. ఈ విషయంలో వివేక్ ఒబెరాయ్ బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ని కూడా వెనక్కి నెట్టేసినట్టు సమాచారం. ఈ ఇద్దరు స్టార్స్ మాత్రమే కాకుండా టాలీవుడ్, బాలీవుడ్ లో ఉన్న చాలా మంది స్టార్ హీరోస్ ను ఈ విషయం లో వెనక్కి నెట్టారు. ఇప్పటికే వివేక్ ఒబెరాయ్ కి విలాసవంతమైన విల్లాలు, కార్లు, బంగళాలు ఉన్నాయి. అంతేకాదు ఖరీదైన రోల్స్ రాయిస్ కార్ కూడా కొన్నారు.
Also Read : Rashmika Mandanna : వామ్మో.. పుష్ప 2 కోసం రష్మిక అన్ని రోజులు పని చేసిందా..
నిజానికి వివేక్ ఒబెరాయ్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన హిట్ లేకపోయినప్పటికీ ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ ద్వారా బాగానే సంపాదిస్తున్నారని అంటున్నారు. మొత్తానికి సీనిమాలతోనే కాకుండా బిజినెస్ లతో కూడా బాగా సంపాదించి చాలా మంది స్టార్ హీరోల కంటే ఎక్కువ సంపాదించారు వివేక్ ఒబెరాయ్.