The Elephant Whisperers : ఆస్కార్ గెలిచిన ఇండియన్ సినిమా.. చరిత్ర సృష్టించిన ది ఎలిఫెంట్ విస్పరర్స్!

ఈ ఏడాది ఆస్కార్ రేస్ లో RRR పాటు 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో, 'అల్ దట్ బ్రీత్స్' డాక్యుమెంటరీ ఫ్యూచర్ ఫిల్మ్ విభాగంలో నామినేషన్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే 'అల్ దట్ బ్రీత్స్' ఆస్కార్ అందుకోలేక పోయింది. కానీ 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' మాత్రం..

The Elephant Whisperers : ప్రతిష్టాత్మక 95వ ఆస్కార్ అవార్డు వేడుకలు మన ఇండియన్ టైం ప్రకారం నేడు ఉదయం 5 గంటల 30 నిమిషాలకు ప్రారంభం అయ్యాయి. లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ ఆస్కార్ వేడుకలకు వేదికైంది. హాలీవుడ్ మాత్రమే కాక దేశ విదేశాల సినీ పరిశ్రమల నుంచి ఎంతోమంది గొప్ప గొప్ప నటులు, నటీమణులు, టెక్నీషియన్స్ ఆస్కార్ వేడుకలకు విచేస్తుండగా.. మన RRR సినిమా నుంచి రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్, సెంథిల్ కుమార్, కీరవాణి, చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, ప్రేమ్ రక్షిత్ మాస్టర్.. లతో పాటు ఉపాసన, రాజమౌళి తనయుడు కార్తికేయ.. మరికొంతమంది ఈ ఈవెంట్ కి హాజరయ్యారు.

Oscars95 : ఇండియన్ ఫిలిం ‘అల్ దట్ బ్రీత్స్’కి మిస్ అయ్యిన ఆస్కార్..

ఇక ఆస్కార్ రేస్ లో RRR తో పాటు ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో, ‘అల్ దట్ బ్రీత్స్’ డాక్యుమెంటరీ ఫ్యూచర్ ఫిల్మ్ విభాగంలో నామినేషన్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ‘అల్ దట్ బ్రీత్స్’ ఆస్కార్ అందుకోలేక పోయింది. కానీ ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ మాత్రం ఆస్కార్ అందుకొని చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు షార్ట్ ఫిలిం కేటగిరీలో 4 సార్లు భారతీయ సినిమాలు ఆస్కార్ కి నామినేట్ అయ్యాయి.

Oscars95 : ‘నాటు నాటు’తో మొదలైన ఆస్కార్ వేడుక..

1969 లో ప్రముఖ ఇండియన్ సినిమాటోగ్రాఫర్ ఫాలీ బిలిమోరియా తెరకెక్కించిన ‘ది హౌస్ దట్ ఆనంద బిల్ట్’ (The House That Ananda Built) బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ఎంపికైంది. ఆ తరువాత 1979 లో ‘యాన్ ఎన్‌కౌంటర్ విత్ ఫేసెస్’ (An Encounter with Faces), 2019 లో ‘పీరియడ్ – ఎండ్ అఫ్ సెంటెన్స్’ (Period End of Sentence) బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో నామినేట్ అవ్వగా.. ‘పీరియడ్ – ఎండ్ అఫ్ సెంటెన్స్’ ఆస్కార్ గెలుచుకుంది.

Oscars95 Live updates : 95వ ఆస్కార్ వేడుకలు.. లైవ్ అప్డేట్స్..

కాగా ‘పీరియడ్ – ఎండ్ అఫ్ సెంటెన్స్’, ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ఈ రెండు చిత్రాలకు ‘గునీత్ మోంగా’ నిర్మాతగా వ్యవహరించారు. ఆమె ఇది రెండు ఆస్కార్ అవార్డు. ఇప్పుడు ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ఆస్కార్ అందుకొని చరిత్ర సృష్టించింది. ఇక మూవీ స్టోరీ విషయానికి వస్తే.. ఒక అడవిలో చిన్న గ్రామంలో ఉండే ఓ వయసుమళ్ళిన జంట ఒక అనాథ ఏనుగు పిల్లని పెంచుకుంటుంది. ఆ ఏనుగు పిల్లతో వీరి అనుబంధం, అడవి, ప్రకృతితో అనుబంధం, ఆ ఏనుగు పిల్ల చేసే అల్లరి.. ఇలా ఆ ఏనుగు పిల్ల, ఆ జంట చుట్టూ కథ ఉంటుంది. ప్రకృతి, జంతువులతో మనుషుల బంధం గురించే ఈ కథ సారాంశం. ఇప్పటికే అనేక అవార్డులు గెలుచుకున్న ఈ సినిమా నేడు ఆస్కార్ ని కూడా అందుకుంది. ఈ సినిమాకి కార్తిక్ గోన్సాల్వేస్ దర్శకత్వం వహించారు. ఆస్కార్ గెలుచుకున్న ఈ మూవీ చూడాలి అనుకుంటే నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది చూసేయండి.

ట్రెండింగ్ వార్తలు