Oscars95 : ఇండియన్ ఫిలిం ‘అల్ దట్ బ్రీత్స్’కి మిస్ అయ్యిన ఆస్కార్..

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆస్కార్ వేడుకలు మొదలు అయ్యాయి. RRR తో పాటు ఆస్కార్ రేస్ లో మరో రెండు సినిమాలు ఉన్న సంగతి కూడా తెలిసిందే. డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ది ఎలిఫెంట్ విస్పరర్స్, డాక్యుమెంటరీ ఫ్యూచర్ ఫిల్మ్ విభాగంలో అల్ దట్ బ్రీత్స్ సినిమాలు నామినేషన్స్ లో నిలిచాయి. అయితే అల్ దట్ బ్రీత్స్..

Oscars95 : ఇండియన్ ఫిలిం ‘అల్ దట్ బ్రీత్స్’కి మిస్ అయ్యిన ఆస్కార్..

Indian film 'All That Breathes' losses Oscar

Oscars95 : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆస్కార్ వేడుకలు మొదలు అయ్యాయి. లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ ఈరోజు ఉదయం 5 గంటల 30 నిమిషాలకు ప్రారంభం అయ్యింది. ఇక ఈ వేడుకకు RRR సినిమా నుంచి రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్, సెంథిల్ కుమార్, కీరవాణి, చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, ప్రేమ్ రక్షిత్ మాస్టర్.. లతో పాటు ఉపాసన, రాజమౌళి తనయుడు కార్తికేయ.. మరికొంతమంది ఈ ఈవెంట్ కి హాజరయ్యారు. RRR కి ఆస్కార్ వస్తుందా లేదా అని అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. కాగా RRR తో పాటు ఆస్కార్ రేస్ లో మరో రెండు సినిమాలు ఉన్న సంగతి కూడా తెలిసిందే.

Oscars95 Live updates : 95వ ఆస్కార్ వేడుకలు.. లైవ్ అప్డేట్స్..

డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ది ఎలిఫెంట్ విస్పరర్స్, డాక్యుమెంటరీ ఫ్యూచర్ ఫిల్మ్ విభాగంలో అల్ దట్ బ్రీత్స్ సినిమాలు నామినేషన్స్ లో నిలిచాయి. అయితే ‘అల్ దట్ బ్రీత్స్’ ఆస్కార్ ని మిస్ చేసుకుంది. దీనితో పాటు రేస్ లో ఉన్న ‘నవల్నీ’ (Navalny) ఆస్కార్ గెలుచుకుంది. ఈ డాక్యుమెంటరీ ఫిలిం రష్యన్ లీడర్ ‘అలెక్సీ నవల్నీ’ జీవిత ఆధారంగా తెరకెక్కింది. డానియెల్ రోహెర్ ఈ పొలిటికల్ డాక్యుమెంటరీని చిత్రీకరించాడు. ఈ ఫిలిం క్రిటిక్స్ ఛాయస్ అవార్డు, BAFTA అవార్డు కూడా అందుకుంది.

Oscar Live Performances : నాటు నాటు సాంగ్ తో పాటు ఆస్కార్ వేదికపై లైవ్ పర్ఫార్మెన్స్ లు ఇంకా ఏమున్నాయో తెలుసా?

ఇక మన ఇండియన్ ఫిలిం ‘అల్ దట్ బ్రీత్స్’ కథ ఏంటంటే.. ఢిల్లీ వజీరాబాద్‌లో బర్డ్ క్లినిక్‌ను నడుపుతున్న నదీమ్ షెజాద్ మరియు మహ్మద్ సౌద్ అనే ఇద్దరు సోదరుల కథ. ఇక్కడ గత 20 సంవత్సరాలుగా ఎన్నో పక్షులకి వైద్యం చేస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న ఢిల్లీ లాంటి నగరాల్లో కాలుష్యం, గాలిపటాలు, రకరకాల పరిస్థితులతో పక్షులు తగ్గిపోతున్నాయి. అంతేకాక అవి వివిధ సమస్యలతో బాధపడుతున్నాయి. అలాంటి పక్షులకు వైద్యం చేయడం, పక్షులు, మనుషుల మధ్య బంధాన్ని చూపించడమే ఈ సినిమా సారాంశం. ఈ సినిమాని షౌనక్ సేన్ తెరకెక్కించాడు. ఈ ఫిలిం అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులు గెలుచుకుంది.