Pushpa 2 : అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు పండ‌గే.. పుష్ప 2 నుంచి సాలీడ్ అప్‌డేట్‌..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న మూవీ పుష్ప 2.

The first half of Pushpa 2 movie is locked

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న మూవీ పుష్ప 2. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. పుష్ప‌కి సీక్వెల్‌గా రూపుదిద్దుకుంటోంది. ర‌ష్మిక మందాన హీరోయిన్‌గా న‌టిస్తున్న‌ ఈ చిత్రం పై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇక ఈ చిత్రం డిసెంబ‌ర్ 6న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా చిత్ర బృందం సాలీడ్ అప్‌డేట్ ఇచ్చింది. ఈ సినిమాకు సంబంధించి ఫస్టాప్‌ ఎడిటింగ్ పూర్తి అయిపోయినట్లుగా తెలిపింది.  ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలియ‌జేసింది. ఫ‌స్టాఫ్ పుష్ప 2 లాక్‌డ్ & లోడెడ్.. అదిరిపోయింది. అంటూ కొత్త పోస్ట‌ర్‌ను కూడా పంచుకుంది.

The Raja Saab : రాజా సాబ్ మేకింగ్ వీడియో చూసారా? మారుతి తో ప్రభాస్ సందడి..

ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. షూటింగ్ అనంత‌రం రెండో భాగం పోస్ట్ ప్రొడక్ష‌న్ ప‌నులు మొద‌లుపెట్ట‌నున్నారు.. ఫహద్‌ ఫాజిల్, సునీల్‌, అనసూయ, జగదీశ్‌ ప్రతాప్‌, ధనుంజయ కీలక పాత్రల్లో న‌టిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.