×
Ad

The Great Pre Wedding Show : రీసెంట్ టైంలో వచ్చిన క్లీన్ కామెడీ సినిమా.. థియేటర్లో చూసి ఫుల్ గా నవ్వుకోండి..

మసూద, పరేషాన్.. సినిమాలతో హిట్స్ కొట్టిన తిరువీర్ ఇప్పుడు ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. (The Great Pre Wedding Show)

The Great Pre Wedding Show

The Great Pre Wedding Show : ఇటీవల కాలంలో కామెడీ సినిమాలు వస్తే బాగానే ఆదరిస్తున్నారు. కానీ ఎలాంటి బూతులు, డబల్ మీనింగ్స్ లేకుండా కామెడీ సినిమాలు చాలా తక్కువగా వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా వచ్చిన ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది.

మసూద, పరేషాన్.. సినిమాలతో హిట్స్ కొట్టిన తిరువీర్ ఇప్పుడు ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టీనా శ్రావ్య హీరోయిన్ గా నటించగా నరేంద్ర రవి, యామిని భాస్కర్ కీలక పాత్రల్లో నటించారు. బై 7PM, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై సందీప్ అగరం, అశ్మితా రెడ్డి నిర్మాణంలో రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా ఇటీవల నవంబర్ 7న థియేటర్స్ లో రిలీజయింది.

Also Read : The Great Pre Wedding Show : ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ మూవీ రివ్యూ.. ఫుల్ గా నవ్వుకోవాల్సిందే..

ప్రీమియర్స్ నుంచే ఈ సినిమాకు ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చింది. ఒక ఫోటోగ్రాఫర్ పెళ్లి చేసుకోబోయే ఓ జంటకు ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తాడు. ఆ ఫుటేజ్ ఉన్న చిప్ పోవడంతో ఏం జరుగుతుంది అని ఫుల్ లెంగ్త్ కామెడీతో పాటు ఒక మంచి ఎమోషన్ తో ఈ సినిమాని నడిపించారు.

లిటిల్ హార్ట్స్ తర్వాత రీసెంట్ టైంలో వచ్చిన బెస్ట్ కామెడీ సినిమా అని చెప్పొచ్చు. ఎలాంటి బూతులు, డబల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా నవ్వించారు. తిరువీర్ అమాయక ఫోటోగ్రాఫర్ పాత్రలో నవ్వించాడు. మిగిలిన అన్ని పాత్రలు కూడా నవ్విస్తాయి. థియేటర్స్ లో ఫ్రెండ్స్, ఫ్యామిలీతో ఈ సినిమాని చూడొచ్చు. చిన్న సినిమా కావడంతో ఓపెనింగ్స్ తక్కువగానే ఉన్నా మౌత్ టాక్ తో రోజురోజుకి బుకింగ్స్ పెరుగుతున్నాయి. మరోసారి తిరువీర్ మసూద, పరేషాన్ తర్వాత చిన్న సినిమాతో ఇంకో హిట్ కొట్టాడు.

Also See : Pawan Kalyan : అడవుల్లో పవన్ కళ్యాణ్.. వాగు వంక చెట్టు పుట్ట పరిశీలించి.. రెండు కిలోమీటర్లు నడిచి.. ఫోటోలు వైరల్..