The Great Pre Wedding Show : తిరువీర్‌ కొత్త సినిమా.. ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ టీజర్ వచ్చేసింది..

తిరువీర్‌ కొత్త సినిమా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో టీజర్ రిలీజ్ అయింది. (The Great Pre Wedding Show)

The Great Pre Wedding Show

The Great Pre Wedding Show : తిరువీర్‌, టీనా శ్రావ్య జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. 7 పి.ఎం.ప్రొడ‌క్ష్స‌న్స్, ప‌ప్పెట్ షో ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్‌పై సందీప్ అగ‌రం, అస్మితా రెడ్డి బాసిని నిర్మాణంలో రాహుల్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. న‌వంబ‌ర్ 7న ఈ సినిమా రిలీజ్ కానుంది.(The Great Pre Wedding Show)

తాజాగా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి విజయ్ దేవరకొండ, శేఖ‌ర్ క‌మ్ములతో టీజర్ రిలీజ్ చేయించారు. విజయ్ దేవరకొండ ఈ సినిమా టీజర్ ని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ప్రపంచానికి నేను తెలిసే కంటే ముందే తిరువీర్ గురించి నాకు తెలుసు. తను కలల ప్రపంచంలో జీవించటాన్ని చూసి నేను సంతోషపడుతుంటాను. ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ టీజర్ చాలా ఆసక్తికరంగా చల్లటి గాలి మనసుని హత్తుకున్నట్లు ఉంది అని పోస్ట్ చేసి మూవీ యూనిట్ ని అభినందించారు.

Also Read : NTR Gym Video : డ్రాగన్ సినిమా కోసం జిమ్ లో ఎన్టీఆర్ కష్టం.. బాడీ లుక్ అదిరిందిగా.. వీడియో వైరల్..

ఇక ఈ టీజర్ చూస్తుంటే ఇప్పుడు పెళ్ళికి ముందు జరుగుతున్న ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్ కథాంశంతో ఓ ఊళ్ళో ఉండే ఫోటో స్టూడియో, అతను చేసే ప్రీ వెడ్డింగ్ షూట్స్, అతని లవ్ స్టోరీతో సాగుతున్నట్టు తెలుస్తుంది.