The Luck : సరికొత్త రియాలిటీ షో.. ‘ది లక్’.. గెలిచిన వాళ్లకు 10 లక్షల బహుమతి..

ప్రజా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ ద్వారా ప్రస్తుత పరిస్థితులను ఆధారంగా తీసుకొని ఒక రియాలిటీ షో ప్రారంభం కానుంది. (The Luck)

The Luck

The Luck : ఇటీవల అన్ని ఛానల్స్, ఓటీటీలలో రియాలిటీ షోలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అనేక భాషల్లో అనేక రకాల రియాలిటీ షోలు ఉన్నాయి. ఇప్పుడు మరో రియాలిటీ షో రాబోతుంది. ప్రజా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ ద్వారా ప్రస్తుత పరిస్థితులను ఆధారంగా తీసుకొని ఒక రియాలిటీ షో ప్రారంభం కానుంది. ఈ రియాలిటీ షోలో అందరూ సామాన్యులు మాత్రమే ఉంటారు.(The Luck)

ఈ కొత్త రియాలిటీ షో పేరు ‘ది లక్’. తాజాగా ప్రజా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ దీనికి సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహించి ‘ది లక్’ పోస్టర్ లాంచ్ చేశారు. ఈ షోను ఒక పెద్ద సెలబ్రిటీ హోస్ట్ చేస్తారని, యూట్యూబ్, ప్రముఖ ఓటిటిలో స్ట్రీమ్ కానుందని తెలిపారు.

Also Read : Tollywood Heroine : సినిమా పెద్ద హిట్.. ఏకంగా ఇన్‌స్టాగ్రామ్ లో తన పేరు మార్చేసుకున్న హీరోయిన్..

ది లక్ రియాలిటీ షోలో స్థైర్యం, వ్యూహం, ఓర్పు ఆధారంగా సవాళ్లు ఉంటాయని, ఇందులో గెలిచిన ప్రతి విజేతకు 10 లక్షల బహుమతి ఇస్తామని, ఎవరెవరు ఆడతారు అనేది ఎంపిక చేస్తారని. ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా ఉచితంగా షోలో పాల్గొనవచ్చు అని ప్రజా ఆర్ట్స్ సంస్థ తెలిపింది. ఈ షోకి సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. అలాగే ఈ షోలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఒక గిఫ్ట్ ఉంటుందని కూడా తెలిపారు.