RRR: థియేటర్‌లో గన్‌తో వ్యక్తి హల్‌చల్‌.. భయాందోళనలో ప్రేక్షకులు!

దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది.

Rrr (1)

RRR: దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ మానియా నడుస్తుంది. గురువారం అర్ధరాత్రి నుండే ప్రీమియర్స్, పలు చోట్ల బెనిఫిట్ షోలతో ఎక్కడ చూసినా ఫ్యాన్స్ హంగామా కనిపించింది. సినిమా చూసిన వారంతా అద్భుతం అంటుండగా.. ఫ్యాన్స్, ప్రేక్షకులు నుంచి సెలబ్రిటీల వరకు ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు.

RRR: థియేటర్ సిబ్బంది-ఫ్యాన్స్ మధ్య వాగ్వాదం.. ఫ్యాన్స్‌పై దాడి?

మన తెలుగు రాష్ట్రాలలో అక్కడక్కడా పలుచోట్ల స్వల్ప ఉద్రిక్తతలు.. వాగ్వాదాలు మినహా రిలీజ్ హంగామా అట్టహాసంగా కనిపించింది. చిత్తూరు జిల్లాలో ఒకచోట ఎన్టీఆర్-రామ్ చరణ్ అభిమానులు పరస్పరం దాడులకు దిగగా.. కరీంనగర్ థియేటర్ యాజమాన్యంతో ఫ్యాన్స్ గొడవ ఒకటి బయటపడింది. ఆర్ఆర్ఆర్ థియేటర్లలో ఎక్కడ చూసినా అభిమానుల హంగామా కనిపించగా.. ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోని ఓ థియేటర్ లో మాత్రం ఓ వ్యక్తి గన్ తో హల్చల్ చేశాడు.

RRR: యూనానిమస్ రెస్పాన్స్.. జక్కన్న ఖాతాలో మరో సెన్సేషనల్ హిట్

తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురంలో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ప్రదర్శితమవుతున్న ఓ థియేటర్‌లోకి ఒక వ్యక్తి గన్‌తో వచ్చాడు. తుపాకీ చేత్తో పట్టుకుని థియేటర్ లో అటూఇటూ తిరగడంతో ప్రేక్షకులు కొంత భయాందోళనకు గురయ్యారు. థియేటర్ యాజమాన్యంతో పాటు ప్రేక్షకుల ఫిర్యాదుతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు మొదలు పెట్టారు. అతడి చేతిలో ఉన్నది బొమ్మ తుపాకీగా అనుమానిస్తున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని ప్రయత్నిస్తున్నారు.