RRR: యూనానిమస్ రెస్పాన్స్.. జక్కన్న ఖాతాలో మరో సెన్సేషనల్ హిట్

మొత్తం డజను సినిమాలు.. ఏ సినిమాకి మరో సినిమాతో సంబంధం లేదు.. ఒక్క బాహుబలి సినిమా తప్ప. అది కూడా రెండు పార్టులుగా వచ్చిన ఒకే సినిమా. ఆయన తీసిన..

RRR: యూనానిమస్ రెస్పాన్స్.. జక్కన్న ఖాతాలో మరో సెన్సేషనల్ హిట్

Rrr

RRR: మొత్తం డజను సినిమాలు.. ఏ సినిమాకి మరో సినిమాతో సంబంధం లేదు.. ఒక్క బాహుబలి సినిమా తప్ప. అది కూడా రెండు పార్టులుగా వచ్చిన ఒకే సినిమా. ఆయన తీసిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్స్. అందులో నటించిన నటీనటులకు సొంతమైన భారీ ఇమేజ్. ఒక్కో సినిమా ఒక్కో మెట్టుగా మలచుకున్న ఆ వ్యక్తే జక్కన్న. వంద రోజులు.. సెంటర్ల లెక్క నుండి నేడు కలెక్షన్ల లెక్కల వరకు అన్ని రికార్డ్స్ ఆయనవే. అందుకే ఆయన సినిమా వస్తుందంటే అందులో స్టార్స్ ఎవరన్నది పక్కనపెట్టేసి మిగతా మేకర్స్ మొత్తం సైడ్ ఇచ్చేస్తున్నారు.

RRR : ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై నారా లోకేష్ స్పెషల్ ట్వీట్..

అలా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చేసింది భారీ క్రేజ్ దక్కించుకున్న మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. గురువారం అర్ధరాత్రి నుండే మొదలైన షోలు.. యూఎస్ ప్రీమియర్స్ దెబ్బతో గురువారం రాత్రి నుండే మొదలైన హంగామా కొనసాగుతూనే ఉంది. దేశంలోని అన్ని బాషల నుండి ఇతర దేశాల వరకు ఎక్కడ చూసినా ఒక్కటే టాక్.. బొమ్మ సూపర్ హిట్. అందులో ఒక్కో నటుడిని ఒకరు మెచ్చుకున్నా.. దర్శకత్వ ప్రతిభ, విజువల్ ఎఫెక్ట్ ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా అప్లాజ్ ఇచ్చినా ఫైనల్ గా అందరి నుండి యూనానిమస్ రెస్పాన్స్ బొమ్మ దద్దరిల్లిందంతే.

RRR : ‘ఆర్ఆర్ఆర్’లో హైలెట్స్ ఇవే.. బెనిఫిట్ షో రివ్యూ ఇదే..

ఈ క్రెడిట్ ముందుగా దర్శకుడు జక్కన్నకే చెల్లాలి. ఎన్నెన్నో అంచనాల నడుమ ఎట్టకేలకు నాలుగేళ్ల తర్వాత ఈ సినిమా బిగ్స్ స్క్రీన్స్ పైకి వచ్చింది. ఈ నాలుగేళ్లలో ఎక్కడా అంచనాలను ఒక్క శాతం తగ్గకుండా చేసిన ఘనత జక్కన్న అండ్ కోదే. ఎన్ని అంచనాలు ఈ సినిమాపై ఉన్నాయో.. ఆ అంచనాలకు తగ్గట్లే ఇప్పుడు ఆల్ ఓవర్ గా రెస్పాన్స్ అందుకోవడంతో జక్కన్న ఖాతాలో మరో సెన్సేషనల్ హిట్ పడ్డట్లే కనిపిస్తుంది. అన్ని భాషల్లో సినీ విమర్శకులు, ప్రముఖులు నుండి వస్తున్న ఇదే రెస్పాన్స్ ఎక్కడ వరకు నడిపిస్తుందో.. ఎన్ని రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.