Sai Pallavi
Sai Pallavi: టాలీవుడ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ సాయి పల్లవి వరుస సినిమాలతో దూసుకుపోతోంది. సినిమాల విషయంలో సెలెక్టెడ్ గా ఉండే సాయి పల్లవి ఇటు తెలుగులో ఇంతమంది గ్లామర్ డాల్స్ ఉన్నా తన యాక్టింగ్ తో , పవర్ ఫుల్ పర్ ఫామెన్స్ తో, ఎలిగెన్స్ తో మల్టిపుల్ సినిమాలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. తమిళ్ అమ్మాయి అయినా అచ్చతెలుగమ్మాయిలా తెలుగులో మాట్లాడుతూ టాలీవుడ్ కి మరింత దగ్గరైపోయింది ఈ టాలెంటెడ్ హీరోయిన్ ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కథ నచ్చితేనే సినిమాకి ఓకే చెప్పే సాయిపల్లవి.. ఈ గ్లామర్ ఫీల్డ్ లో తనదైన స్టైల్లో ఫుల్ స్పీడ్ లో దూసుకుపోతోంది.
Rashi Khanna: బెల్లీ అందాలతో గిలిగింతలు పెట్టేస్తున్న ఢిల్లీ భామ!
సినిమాల విషయంలోనేకాదు.. క్యారెక్టర్స్ విషయంలో కూడా తన రూటేసెపరేట్. రెమ్యూనరేషన్ ఎంతిస్తామన్నాసరే ఇంపార్టెన్స్ లేని క్యారెక్టర్స్ చెయ్యడానికి ఏమాత్రం మొహమాటం లేకుండా నో చెప్పే సాయిపల్లవి స్ట్రెయిట్ ఫార్వర్డ్ నెస్ కి ఫుల్ ఫిదా అయిపోయారు జనాలు. సాయిపల్లవి అందంకంటే కూడా అభినయంతోనే ఆడియన్స్ ని ఆకట్టుకుంది. అంతేకాదు.. తమిళ్ అమ్మాయి అయినా తెలుగులో మంచి హిట్స్ కొట్టడంతో పాటు తన యాటిట్యూడ్ తో తెలుగు ప్రేక్షకుల్ని ఫిదా చేసింది ఈముద్దుగుమ్మ. అందుకే ఇప్పటికే టాలీవుడ్ లో గ్లామర్ బ్యూటీస్ ఎంత మంది ఉన్నా పర్ ఫామెన్స్, క్యారెక్టర్స్ చెయ్యాలంటే పవర్ ఫుల్ రోల్ లో కనిపించాలన్నా, హీరోతో సమానంగా క్రేజ్ సంపాదించాలన్నా సాయిపల్లవి మాత్రమే కనిపిస్తుంది డైరెక్టర్లకి.
Hari Hara Veera Mallu: హీరోయిన్ ఫిక్స్.. జాక్వెలిన్ స్థానంలో కెనడియన్ బ్యూటీ!
టాలీవుడ్.. కోలీవుడ్ లో వరుస సినిమాలతో సందడి చేస్తోంది సాయి పల్లవి. సెలెక్టెడ్ గా సినిమాలు చేసే తమిళ బ్యూటీ.. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోతోంది. ఎంత మంది హీరోయిన్లు ఉన్నా తన గ్రేస్ తో ఈజ్ తో ఆడియన్స్ ని ఫిదా చేసే ఈ క్యూట్ హీరోయిన్ శ్యామ్ సింగరాయ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. సాయిపల్లవి కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎప్పుడూ గ్లామర్ రోల్స్ చెయ్యలేదు. పర్ ఫామెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ తోనే ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసింది. ఎంత మంది హీరోయిన్లు ఉన్నా తనకంటూ ఓ రూట్ క్రియేట్ చేసుకుంది సాయిపల్లవి. నానితో చేస్తున్న శ్యామ్ సింగరాయ్ సినిమాలో కూడా దేవదాసిగా అరుదైన క్యారెక్టర్ చేస్తోంది సాయిపల్లవి. పవర్ ఫుల్ రోల్ లో మరోసారి తన ఇంటెన్స్ యాక్టింగ్ ని చూపించబోతోంది ఈ స్టార్ హీరోయిన్.
Sidhika Sharma: ఓరచూపులతో కైపెక్కిస్తున్న సిద్ధికా శర్మ!
శ్యామ్ సింగరాయ్ తో పాటు వేణు ఊడుగుల డైరెక్షన్లో రానాతో విరాటపర్వం మూవీలో నటిస్తోంది. ఈ సినిమాలో ఏజెన్సీ గిరిజన అమ్మాయిగా కొత్త లుక్ లో కనిపించబోతోంది సాయిపల్లవి. నక్సలైట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల్ని పలకరించబోతోంది. ఈ సినిమాలో కూడా ఏదో అలా వచ్చి వెళ్లిపోయే హీరోయిన్ గా కాకుండా స్క్రీన్ మీద తన ప్రజెన్స్ ని ఆడియన్స్ ఫీలయ్యేలా సినిమాకి మెయిన్ పిల్లర్ రోల్ చేస్తోంది సాయిపల్లవి. సాయిపల్లవి ఎలాంటి సినిమా చేసినా.. అందులో స్టార్ కాస్ట్ కంటే ముందు సినిమాలో తన క్యారెక్టర్ ని, తన క్యారెక్టర్ కి ఉన్న ఇంపార్టెన్స్ నే చూసుకుంటుంది. అందుకే సాయిపల్లవి కోసం స్పెషల్ గా క్యారెక్టర్లు రాస్తారు రైటర్స్. అంతేకాదు, ఈ క్యారెక్టర్ కి సాయిపల్లవి తప్ప వేరే ఎవరూ న్యాయం చెయ్యలేరనేలా యాక్ట్ చేసి ప్రేక్షకుల్ని అదే రేంజ్ లో మెప్పిస్తుంది ఈ టాలెంటెడ్ ఆర్టిస్ట్. అందుకే ఎంతమంది హీరోయిన్లొచ్చినా సాయిపల్లవి పర్ పామెన్స్ ని మ్యాచ్ చెయ్యడం అంత ఈజీ కాదంటారు ఫాన్స్.