×
Ad

The Rajasaab: అర్ధరాత్రి జీవో జారీ.. తెలంగాణాలో రాజాసాబ్ టికెట్ ధరలు పెంపు

'ది రాజసాబ్' మేకర్స్ కి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ‘ది రాజా సాబ్(The Rajasaab)’ టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

The Raja Saab movie ticket prices hike in Telangana.

  • రాజాసాబ్ మేకర్స్ కి గుడ్ న్యూస్
  • తెలంగాణాలో రాజాసాబ్ టికెట్ ధరలు పెంపు
  • ప్రీమియర్స్ కి నో పర్మిషన్

The Rajasaab: ది రాజసాబ్ మూవీ మేకర్స్ కి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ‘ది రాజా సాబ్(The Rajasaab)’ టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం రాజాసాబ్ సినిమా శుక్రవారం రిలీజ్ అవ్వాలి. కానీ, ఒకరోజు ముందే అంటే గురువారం రాత్రి నుంచే ప్రీమియర్స్ వేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు నిర్మాతలు.

కానీ, ప్రీమియర్స్ కి పర్మిషన్ ఇవ్వని తెలంగాణ ప్రభుత్వం, టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతిస్తూ జీవో జారీ చేసింది. అది కూడా గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ జీవో జారీ చేసింది. ఈ జీవో ప్రకారం.. శుక్రవారం జనవరి 9 నుంచి జనవరి 11వ తేదీ వరకు మూడు రోజులపాటు సింగిల్ స్క్రీన్ లో రూ.105, మల్టీప్లెక్స్‌లలో రూ.132 రూపాయలు పెంచేందుకు అనుమతి ఇచ్చింది.

The Raja saab Twitter Review: ది రాజాసాబ్ ట్విట్టర్ రివ్యూ.. ప్రభాస్ కామెడీ యాంగిల్ ఎలా ఉందంటే?

అలాగే జనవరి 12వ తేదీ నుంచి జనవరి 18వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.62, మల్టీప్లెక్స్‌లో రూ.89 పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, ఈ టికెట్లు పెంపు వల్ల వచ్చిన లాభంలో 20% ఫిలిం ఫెడరేషన్‌కు ఇవ్వాలని కూడా ప్రభుత్వం పేర్కొంది. దీంతో, ప్రభుత్వం అందించిన సహకారానికి మేకర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక దర్శకుడు మారుతి తెరకెక్కించిన ఈ హారర్ అండ్ థ్రిల్లర్‌ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి కుమార్ హీరోయిన్స్ గా నటించారు.