The Suspect : ‘ది సస్పెక్ట్’ మూవీ రిలీజ్ ఎప్పుడంటే..
ఇటీవల ది సస్పెక్ట్ ట్రైలర్ రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు.

The Suspect Movie Release Date Announced
The Suspect : రుషి కిరణ్, శ్వేత, రూప, శివ యాదవ్, రజిత, ఏకెన్ ప్రసాద్, మృణాల్.. పలువురు ముఖ్య పాత్రల్లో నటించిన సినిమా ది సస్పెక్ట్. టెంపుల్ టౌన్ టాకీస్ బ్యానర్ పై కిరణ్ కుమార్ నిర్మాణంలో రాధాకృష్ణ గర్నెపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.
Also See : Raashii Khanna : ఫ్యామిలీతో కలిసి రాశీఖన్నా హోలీ సెలబ్రేషన్స్.. క్యూట్ ఫొటోలు చూశారా?
ఇటీవల ది సస్పెక్ట్ ట్రైలర్ రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ది సస్పెక్ట్ సినిమా మార్చి 21న విడుదల కానుంది. ఒక మర్డర్ చుట్టూ తిరిగే క్రైమ్ థ్రిల్లర్ సినిమాగా రానుంది.

నిర్మాత కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. ది సస్పెక్ట్ సినిమా ఆడియన్స్ కి కొత్త ఫీల్ ఇస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఆడియన్స్ ని మెప్పిస్తుంది. ఈ సినిమా SKML మోషన్ పిక్చర్స్ ద్వారా ఆంధ్ర, తెలంగాణలో మార్చి 21న విడుదల కానుంది అని తెలిపారు.