×
Ad

Akhanda 2 : నంద‌మూరి బాల‌కృష్ణ ‘అఖండ 2’ నుంచి ‘తాండవం’ సాంగ్‌ వచ్చేసింది.. గూస్ బంప్స్‌

నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తున్న చిత్రం అఖండ‌-2 (Akhanda 2 ).

The Thaandavam Song out now from NandamuriBalakrishna Akhanda 2 movie

Akhanda 2 : నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తున్న చిత్రం అఖండ‌-2. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. అఖండ‌కు సీక్వెల్‌గా ఈ చిత్రం వ‌స్తుండ‌డంతో ఈ మూవీ పై (Akhanda 2) భారీ అంచ‌నాలే ఉన్నాయి. డిసెంబ‌ర్ 5న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ బాష‌ల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది.

ఇక విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌డంతో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను మొద‌లుపెట్టింది. అందులో భాగంగా తాజాగా ఈ చిత్రంలోని తొలి పాట‌ను విడుద‌ల చేసింది.

Kaantha Review : ‘కాంత’ మూవీ రివ్యూ.. సినిమాలో సినిమా.. పీరియాడికల్ డ్రామా అదిరిందిగా..

శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్ లు క‌లిసి పాడిన ‘అఖండ తాండవం’ అంటూ సాగే ఈ పాట గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఈ చిత్రంలో సంయుక్త కథానాయిక. 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.