Laapataa Ladies : ఆస్కార్ కోసం సినిమా టైటిల్ నే మార్చేసారుగా..

The title of the movie was changed for Oscar

Laapataa Ladies : కిరణ్ రావు దర్శకత్వంలో వచ్చిన ‘లాపటా లేడీస్’ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. మంచి ప్రశంశలను అందుకుంది. మార్చి 1, 2024లో విడుదలైన ఈ సినిమా ఇటీవల ఆస్కార్ కి ఎంపికైంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఆమిర్ ఖాన్ నిర్మించిన ఈ సినిమా టైటిల్ ను మేకర్స్ మార్చినట్టు తెలుస్తుంది.

అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాకి మరింత గుర్తింపు రావాలని ఈ సినిమా టైటిల్ ను మారుస్తునట్టు సమాచారం. లాపటా లేడీస్ గా ఉన్న ఈ సినిమా టైటిల్ ను ‘లాస్ట్ లేడీస్’ గా మారుస్తున్నారు. ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక సరికొత్త పోస్టర్ సైతం విడుదల చేశారు మేకర్స్. ఆ పోస్టర్ లో ఇప్పటినుండి లాపటా లేడీస్ సినిమా టైటిల్ ను ‘లాస్ట్ లేడీస్’ గానే పిలవాలి అని సోషల్ మీడియాలల్లో కూడా ఇదే పేరు ఉంటుందన్నారు.

Also Read ; Song Jae-rim : ప్రముఖ కొరియన్ నటుడు సాంగ్ జే రిమ్ ఇక లేరు..

ఆస్కార్ వేడుకలు 2025 మార్చి 3న జరగనుంది. అందుకుగాను ఇప్పటినుండి లాస్ట్ లేడీస్ అనే పేరుతో దీన్ని ప్రమోట్ చెయ్యనున్నట్టు తెలుస్తుంది. రామ్ సంపత్ సంగీతం అందించిన ఈ సినిమాలో నితాన్షి గోయెల్, ప్రతిభా రాంత , స్పర్ష్ శ్రీవాస్తవ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ఇప్పటికే ఇండియన్ ఆడియన్స్ ను మెప్పించిన ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలిచి అవార్డు గెలుస్తుందా లేదా చూడాలి.