Song Jae-rim : ప్రముఖ కొరియన్ నటుడు సాంగ్ జే రిమ్ ఇక లేరు..

Song Jae-rim : ప్రముఖ కొరియన్ నటుడు సాంగ్ జే రిమ్ ఇక లేరు..

Famous Korean actor Song Jae Rim is no more

Updated On : November 13, 2024 / 2:14 PM IST

Song Jae-rim : ప్రముఖ కొరియన్ నటుడు సాంగ్ జే రిమ్ తన అపార్ట్ మెంట్ లో శవమై కనిపించాడు. అతి చిన్న వయస్సులోనే ఆయన కన్నుమూయడంతో ఫ్యాన్స్ షాక్ కి గురయ్యారు. ప్రస్తుతం ఆయన వయస్సు 39 మాత్రమే. నవంబర్ 12న ఈ నటుడు తన సియోల్ అపార్ట్‌మెంట్‌లో మరణించినట్లు తెలుస్తుంది. ఇక ఆయన చనిపోయిన స్థలంలో రెండు పేజీల లేఖ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆయన మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది.

ఇక సాంగ్ జే రిమ్ ముందు మూన్ ఎంబ్రేసింగ్ ది సన్, టూ వీక్స్ , అవర్ గ్యాప్-సూన్ వంటి షోలలో నటించి మోడల్ గా మారాడు. అలా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సడన్ గా చనిపోవడం ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా సాంగ్ జే రిమ్ అంత్యక్రియలు నవంబర్ 14న నిర్వహించనున్నారు.

Also Read : Shahid Kapoor : ముంబైలో అపార్ట్‌మెంట్‌ తీసుకున్న షాహిద్ కపూర్.. నెల రెంట్ అన్ని లక్షలా..

రన్‌వే మోడల్‌గా తన కెరీర్ స్టార్ట్ చేసిన సాంగ్ జే రిమ్ చాలా మంది ప్రముఖ డిజైనర్ లతో కలిసి పని చేశారు. అంతేకాకుండా చాలా మ్యాగజైన్ లలో కూడా కనిపించారు. మరి ఈ నటుడు ఇంత సడన్ గా ఎలా చనిపోయారు అన్న నిజాలు తెలియాల్సి ఉంది.