Big Boss Rathika : రాహుల్ సిప్లిగంజ్‌తో రతిక బ్రేకప్ గురించి ఆమె పేరెంట్స్ ఏం చెప్పారంటే?

రతిక రోజ్.. తెలుగు బిగ్ బాస్ సీజన్-7 చూస్తున్నవారందరికీ బాగా తెలిసిన పేరు. బిగ్ బాస్ ఎంట్రీకి ముందు రతికకు రాహుల్ సిప్లిగంజ్‌తో బ్రేకప్ అయిన విషయం బయటకు వచ్చింది. దీనిపై తాజాగా ఆమె పేరెంట్స్ క్లారిటీ ఇచ్చారు.

Big Boss Rathika

Big Boss Rathika : బిగ్ బాస్ సీజన్ 7 లో ఎంట్రీ ఇచ్చిన అందరిలో రతిక రోజ్ స్పెషల్ అనే చెప్పాలి. ఫ్రెష్ లుక్‌తో అందర్నీ ఆకట్టుకుంటున్న రతికకి సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌తో బ్రేకప్ అయ్యిందన్న విషయం ఆమె బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చాక వైరల్ అయ్యింది. అయితే దీనిపై రతిక క్లారిటీ ఇచ్చింది.. తాజాగా ఆమె తల్లిదండ్రులు వీరి బ్రేకప్ విషయంలో ఏం చెప్పారంటే?

రతిక రోజ్ బిగ్ బాస్ సీజన్ 7 లో కత్తిలాంటి పిల్ల అని పేరు తెచ్చుకుంది. తోటి కంటెస్టెంట్లతో గొడవలు, లవ్ ఎఫైర్లు నడిచినా వీటికి ముందు బిగ్ బాస్ సీజన్-3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో లవ్ ట్రాక్ నడిచిందనే విషయం ఇటీవలే బయటకు వచ్చింది. మూవీల్లోకి రాకముందు లవ్ ఉండేదని.. పెళ్లి కూడా చేసుకుందామనుకున్నామని.. కానీ వాళ్లకి తను ఇండస్ట్రీలో ఉండటం ఇష్టం లేదన్నారని అది తనకు నచ్చలేదని చెప్పుకొచ్చింది. వరుసగా సినిమా అవకాశాలు వస్తుంటే పెళ్లి చేసుకోవాలనే డెసిషన్ తీసుకోవాలని అనిపించలేదని రతిక గతంలో వివరణ ఇచ్చింది.

Keeda Cola : అదరగొడుతున్న తరుణ్ భాస్కర్ ‘కీడాకోలా’ సినిమా.. రెండు రోజుల్లో కలెక్షన్స్ ఎంతో తెలుసా?

కాగా.. బిగ్ బాస్‌లో ఒకసారి ఎలిమినేట్ అయ్యి తిరిగి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత రతిక పేరెంట్స్ రాములు, అనిత మీడియాతో మాట్లాడారు. తమ బిడ్డ ఎంతో కష్టపడి పైకొచ్చిందని.. తమ కుటుంబాన్ని ఎంతగానో ఆదుకుందని.. ఆమెను తాము కొడుకుగా భావిస్తామని చెప్పుకొచ్చారు. పటాస్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు దివంగత నటి, దర్శకురాలు విజయనిర్మల ఫోన్ చేసి తాము తీయబోయే ‘ఈ జన్మ నీకే’ సినిమాలో రెండో హీరోయిన్ గా నటించమని రతికను అడిగారని తాము ఒప్పుకుని పంపించామని రతిక తండ్రి రాములు చెప్పారు. అయితే ఆ సినిమా అనుకోని కారణాల వల్ల విడుదల కాలేదని చెప్పారాయన.

రతికకు కొన్ని సినిమా అవకాశాలు వచ్చిన సమయంలోనే రాహుల్ సిప్లిగంజ్‌తో కలిసి యూట్యూబ్ కోసం కొన్ని పాటలు చేసారని.. ఆ టైమ్‌లో అందరూ వారిద్దరి రిలేషన్ తప్పుగా మాట్లాడుకోవడం విని బాధపడ్డామని చెప్పారు. తమ రెండో కూతురి పెళ్లికి వచ్చిన రాహుల్‌ని మళ్లీ తమ ఇంటికి రమ్మని పిలిచామని.. రతికను పెళ్లి చేసుకుంటానంటే మాట్లాడాలని అనుకున్నానని.. కానీ అతను మళ్లీ టచ్‌లో లేకుండా పోయాడని అన్నారాయన. తన కూతురు అందరితో స్నేహంగా ఉంటుందని బిగ్ బాస్ హౌస్‌లో కూడా తను అలా ఉండటాన్ని కొందరు తప్పు పట్టారని చెప్పారాయన. తమ బిడ్డ టాప్ 5 లో ఉంటుందని రతిక పేరెంట్స్ ఆకాంక్షిస్తున్నారు.

Guntur Kaaram : ‘గుంటూరు కారం’ నుంచి ‘దమ్ మసాలా’ సాంగ్ ప్రోమో వచ్చేసింది..

రతిక బొమ్మ అదిరింది.. దిమ్మ తిరిగింది, నేను స్టూడెంట్ సర్ వంటి సినిమాల్లో నటించింది. అవి పెద్దగా జనాలకి రీచ్ కాకపోవడంతో బిగ్ బాస్ హౌస్‌కి వచ్చింది. ఈ సీజన్‌లో బిగ్ బాస్ స్టేజ్‌పై ఎన్ని వివాదాలు మూట కట్టుకున్నా తనదైన అందంతో అందర్నీ ఆకట్టుకున్న బ్యూటీ మాత్రం రతిక అనే చెప్పాలి.