Keeda Cola : అదరగొడుతున్న తరుణ్ భాస్కర్ ‘కీడాకోలా’ సినిమా.. రెండు రోజుల్లో కలెక్షన్స్ ఎంతో తెలుసా?

తరుణ్ భాస్కర్(Tharun Bhascker) చాలా గ్యాప్ తర్వాత తన మూడో సినిమా ‘కీడా కోలా’(Keeda Cola)తో వచ్చాడు. క్రైం కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 3న రిలీజ్ అయి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

Keeda Cola : అదరగొడుతున్న తరుణ్ భాస్కర్ ‘కీడాకోలా’ సినిమా.. రెండు రోజుల్లో కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Tharun Bhascker Keeda Cola Movie Two Days Collections

Updated On : November 5, 2023 / 11:52 AM IST

Keeda Cola : పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో యూత్ ని అలరించిన దర్శకుడు తరుణ్ భాస్కర్(Tharun Bhascker) చాలా గ్యాప్ తర్వాత తన మూడో సినిమా ‘కీడా కోలా’(Keeda Cola)తో వచ్చాడు. క్రైం కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 3న రిలీజ్ అయి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. యూత్ ని బాగా అలరిస్తూ మంచి విజయం సాధించింది కీడా కోలా సినిమా.

తక్కువ బడ్జెట్ లో అందరు చిన్న ఆర్టిస్టులతోనే తీసిన ఈ సినిమాకు కలెక్షన్స్ భారీగానే వస్తున్నాయి. సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేసింది. కీడా కోలా సినిమా మొదటి రోజే 6 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాగా రెండు రోజుల్లో ఈ సినిమా 9.72 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్టు ప్రకటించారు చిత్రయూనిట్. ఇక నేడు ఆదివారం కావడంతో మరిన్ని కలెక్షన్స్ వస్తాయని భావిస్తున్నారు.

Also Read : Guntur Kaaram : ‘గుంటూరు కారం’ నుంచి ‘దమ్ మసాలా’ సాంగ్ ప్రోమో వచ్చేసింది..

చిన్న సినిమా అయినా కీడాకోలాకు భారీగానే కలెక్షన్స్ వస్తున్నాయి. తరుణ్ భాస్కర్ సినిమాని ముందుండి చాలా కొత్తగా ప్రమోషన్స్ కూడా చేశాడు. ఇక ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కూడా చేశాడు. కీడాకోలా సినిమాలో బ్రహ్మానందం, ’30 వెడ్స్ 21′ ఫేమ్ చైతన్య రావు, రవీంద్ర విజయ్, విష్ణు, రాగ్ మయూర్.. పలువురు ముఖ్య పాత్రల్లో నటించారు.