Thellakaagitham : గుర్తింపు కోసం చీప్ పబ్లిసిటీ.. రొమాంటిక్ సీన్ లీక్ చేసి..
రెడిట్ లో తెల్లకాగితం సినిమాలోని హీరో - హీరోయిన్ రొమాంటిక్ సీన్ ఒకటి లీక్ అయింది. (Thellakaagitham)
- Saketh U
- Published on- September 30, 2026 / 12:47 PM IST
Thellakaagitham
Thellakaagitham : ఇటీవల సినిమా యూనిట్స్ తమ సినిమా ఒకటి ఉందని జనాలు గుర్తించడానికి ప్రమోషన్స్ లో విన్యాసాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రమోషన్స్ లో కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఒక్కోసారి ఇవి మితి మీరుతున్నాయి కూడా. అయితే తాజాగా తెల్ల కాగితం అనే సినిమా యూనిట్ తమ సినిమా ప్రమోషన్స్ కోసం ఓ చీప్ ట్రిక్ ప్లే చేసారు.
రెడిట్ లో తెల్లకాగితం సినిమాలోని హీరో – హీరోయిన్ రొమాంటిక్ సీన్ ఒకటి లీక్ అయింది. అది ట్విట్టర్ లో కూడా షేర్ అయింది. అయితే ఆ వీడియో వైరల్ అవ్వలేదు. కానీ తమ సినిమాని లీక్ చేసారని, లీక్ చేసిన వీడియోలు షేర్ చేయొద్దని మూవీ యూనిట్ ఓ లెటర్ పోస్ట్ చేయడం గమనార్హం. కోర్ట్ సినిమాతో ఫేమ్ తెచ్చుకున్న హర్ష రోషన్, కొత్త అమ్మాయి నక్షత్ర జంటగా ఇంటర్ ప్రేమకథగా తెల్లకాగితం సినిమాని కొత్త దర్శకుడు తెరకెక్కించాడు.
ఈ సినిమా నుంచి టీజర్, ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఒక్క సాంగ్ మాత్రం బాగుంది. తెల్ల కాగితం సినిమా అక్టోబర్ 2న రిలీజ్ కానుంది. కానీ ఈ సినిమాకు పెద్దగా బజ్ రాలేదు. పైగా అదే రోజు దాదాపు ఓ పది సినిమాలు రిలీజ్ కి ఉన్నాయి. దీంతో మూవీ యూనిట్ స్వయంగా తమ సినిమాకు బజ్ రావడానికి వాళ్ళే వీడియో రిలీజ్ చేసారని టాలీవుడ్ టాక్. అసలు వైరల్ అవ్వకుండానే లీక్ చేసారు అని లబోదిబోమంటూ పోస్ట్ పెట్టారు. ఇండస్ట్రీలో ఆ సినిమా వాళ్ళే మూవీని లీక్ చేసారని, అది కూడా రొమాంటిక్ సీన్ లీక్ చేసి యూత్ ని అట్రాక్ట్ చేయాలని భావించినట్టు చర్చలు జరిగాయి.
సోషల్ మీడియాలో కూడా పలువురు నెటిజన్లు ఇవే విమర్శలు చేసారు. ప్రమోషన్ కోసం మరీ ఇంత చీప్ పబ్లిసిటీ చేయాలా అని మూవీ యూనిట్ ని విమర్శిస్తున్నారు నెటిజన్లు. సినిమాకు బజ్ రావడానికి ఇంటర్ చదివే పాత్రలు రొమాన్స్ చేసే సీన్స్ లీక్ చేయాలా అని ఫైర్ అవుతున్నారు కొంతమంది. లీక్ అయినప్పుడు ఈ సినిమా వైరల్ అవ్వలేదు కానీ లీక్ చేసారని మూవీ యూనిట్ లెటర్ రిలీజ్ చేసినప్పుడు మాత్రం ఇదిగో ఇలా ప్రమోషన్స్ కోసం వాళ్ళ సినిమాని వాళ్ళే లీక్ చేసారు అని వైరల్ అయింది. కావాల్సినంత బజ్ రాకపోయినా తెల్లకాగితం అనే సినిమా ఉందని సోషల్ మీడియా వాడే వాళ్లకు తెలిసింది. మరి సినిమాకు ఆడియన్స్ వస్తారా లేదా చూడాలి. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో జరగనుంది.
