Dharmendra
Dharmendra : తండ్రి ధర్మేంద్రను ప్రత్యేక చికిత్స కోసం సన్నీ డియోల్ అమెరికా తీసుకెళ్లినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్ని వారి సన్నిహితులు ఖండించారు. సన్నీ తన పేరెంట్స్ ఇద్దర్నీ యుఎస్‌కు విహారయాత్రకు తీసుకెళ్లినట్లు వారు స్పష్టం చేసారు.
Sunny Deol : తన ఐక్యూ గురించి చెప్పిన సన్నీ డియోల్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ తన తండ్రి సీనియర్ నటుడు ధర్మేంద్ర తల్లి ప్రకాష్ కౌర్‌లతో యూఎస్‌లో ఉన్నారు. ధర్మేంద్రకు ప్రత్యేక చికిత్స కోసం సన్నీ ఆయనను యూఎస్ తీసుకెళ్లారంటూ వార్తలు హల్చల్ చేశాయి. అయితే ధర్మేంద్ర ఆరోగ్యంగా ఉన్నారని.. ఆందోళన చెందాల్సిన పని లేదని తెలుస్తోంది. కుటుంబం మొత్తం హాలీడేస్ ఎంజాయ్ చేయడానికి యూఎస్ వెళ్లారట.
ధర్మేంద్రకు 19 సంవత్సరాల వయసులో ప్రకాష్ కౌర్‌తో 1954 లో వివాహమైంది. వీరికి వివాహమై 70 సంవత్సరాలు అవుతోంది. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. ప్రకాష్ కౌర్‌తో విడాకులు తీసుకోకుండానే ధర్మేంద్ర నటి హేమామాలినిని పెళ్లాడారు. హేమమాలినీతో విడిపోయిన ధర్మేంద్ర ప్రస్తుతం తన మాజీ భార్య ఆమె కుటుంబంతో ఉంటున్నారు. ఇటీవల సన్నీ డియోల్ కొడుకు కరణ్ పెళ్లిలో ధర్మేంద్ర, ప్రకాష్ కౌర్ కలిసి కనిపించారు. కొన్ని రోజుల క్రితం సన్నీ డియోల్ తన తల్లి ప్రకాష్ కౌర్ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫోటోతో పాటు ‘అమ్మా హ్యాపీ బర్త్ డే లవ్ యు’ అనే శీర్షికతో సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
Gadar 2 : బాలీవుడ్‌లో మరో భారీ హిట్.. 400 కోట్లు కలెక్ట్ చేసిన సన్నీ డియోల్ గదర్ 2..
ఇదిలా ఉంటే సన్నీ డియోల్ గదర్ 2 బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ చిత్రంగా నిలిచింది. దాదాపుగా రెండు దశాబ్దాల తర్వాత గదర్ 2 సక్సెస్ పార్టీలలో సన్నీ డియోల్, షారుఖ్ ఖాన్ కలిసి కనిపించారు.