Sunny Deol : తన ఐక్యూ గురించి చెప్పిన సన్నీ డియోల్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
సన్నీ డియోల్ తన ఐక్యూ గురించి చెబుతూ ట్రోల్‌కి గురయ్యారు. ఓ పోడ్కాస్ట్లో పాల్గొన్న ఆయన తన చిన్ననాటి విశేషాలు పంచుకునే క్రమంలో తన ఐక్యూ గురించి చెప్పిన విషయం నెటిజన్లకు నవ్వు తెప్పించింది.

Sunny Deol
Sunny Deol : బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ గద్దర్ 2 సినిమా సక్సెస్‌తో జోష్‌లో ఉన్నారు. పలు ఇంటర్వ్యూలలో కనిపిస్తున్నారు. తాజాగా రణ్వీర్ అల్లాబాడియా పోడ్కాస్ట్లో సన్నీ తన చిన్ననాటి సంగతులు షేర్ చేసుకునే సందర్భంలో తన ఐక్యూ గురించి చెప్పిన మాటలు అందరికీ నవ్వు తెప్పించాయి. నెటిజన్లు ఫుల్ ట్రోల్ చేస్తున్నారు.
Gadar 2 : బాలీవుడ్లో మరో భారీ హిట్.. 400 కోట్లు కలెక్ట్ చేసిన సన్నీ డియోల్ గదర్ 2..
రణ్వీర్ అల్లాబాడియా యొక్క పోడ్కాస్ట్లో సన్నీ డియోల్ తన చిన్ననాటి అంశాలు షేర్ చేసుకున్నారు. తను చిన్నప్పుడు డైస్లెక్సియాతో ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చారు. ఇది ప్రధానంగా చదవడం, రాయడం, స్పెల్లింగ్ నైపుణ్యాలను ప్రభావితం చేసే న్యూరో డెవలప్మెంటల్ కండిషన్‌గా ఆయన పేర్కొన్నారు. తరచుగా పిల్లల్లో ఈ రుగ్మత కనిపిస్తుందని ఈ పరిస్థితి కారణంగా తాను చదువుకోలేదని సన్నీ చెప్పారు.
సన్నీ ఇంకా తన ఐక్యూ గురించి మాట్లాడుతూ చిన్నప్పుడు తన ఐక్యూ ఎక్కువగా ఉండేదని.. స్కూల్లో ఓసారి జరిగిన ఐక్యూ టెస్ట్‌లో 160 కి పైగా ఉందని చెప్పడంతో అల్లాబాడియా షాకయ్యారు. సాధారణంగా 140 ఐక్యూ ఉంటేనే మేధావిగా పరిగణిస్తారు. ఇక ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఐక్యూ 160 అంటే సన్నీ ఐక్యూ ఆయన ఐక్యూతో సమానం అన్నమాట.
Sunny Deol : బాడీలు పెంచడం కాదు.. యాక్టింగ్ చేయండి.. బాలీవుడ్ హీరోలపై సన్నీ డియోల్ వ్యాఖ్యలు..
సన్నీ డియోల్ మాటలు నెటిజన్లకు నవ్వు తెప్పించాయి. ఫుల్ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఆయకు ఉన్న దానిని ఐక్యూ అనరని బీపీ అంటారని.. ఈ వీడియో చూసాకా ఆయనపై ఉన్న గౌరవం మొత్తం పోయిందని కామెంట్లు స్టార్ట్ చేసారు. మొత్తానికి సన్నీ డియోల్ వీడియో వైరల్ అవుతోంది.
View this post on Instagram