ఓ ఇంటివాడైన టాలీవుడ్ హీరో.. కొత్త జీవితం ప్రారంభం అంటూ ఫొటోలు..

Thiruveer: కల్పనారావ్ అనే అమ్మాయితో తిరువీర్ ఏడు అడుగులు నడిచాడు.

Thiruveer

‘మసూద’ మూవీ హీరో తిరువీర్ ఓ ఇంటివాడయ్యాడు. కల్పనారావ్ అనే అమ్మాయితో తిరువీర్ ఏడు అడుగులు నడిచాడు. కొత్త జీవితం ప్రారంభం అంటూ తన పెళ్లికి సంబంధించిన ఫొటోలను తిరువీర్ పోస్ట్ చేశాడు. తిరువీర్ కి పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

రంగారెడ్డి జిల్లాలోని మామిడిపల్లికి చెందిన తిరువీర్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘మసూద’, ‘పరేషాన్’ వంటి వేర్వేరు జోనర్ల సినిమాలతో ఆకట్టుకున్నాడు. జార్జ్ రెడ్డి, పలాస వంటి సినిమాల్లోనూ నటించాడు.

‘మసూద’ సినిమా హిట్ అయిన తర్వాత అతడికి వరుసగా ఆఫర్లు వచ్చాయి. శ్రీ రామనవమి సందర్భంగా సోసియో ఫాంటసీ ప్రాజెక్ట్ ను ప్రకటించాడు. #Thiruveer4తో ఈ మూవీ ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. గతంలో రేడియో జాకీగానూ తిరువీర్ పనిచేశాడు. ‘ఆర్జే తిరూ’ అంటూ శ్రోతలను పలకరించేవాడు.

Kalki 2898 AD : ‘అశ్వత్థామ’గా అమితాబ్ బచ్చన్.. కల్కి నుంచి అమితాబ్ వీడియో వచ్చేసింది..