thiruveer
Thiruveer : థియేటర్ ఆర్టిస్ట్ నుంచి నటుడిగా మారాడు తిరువీర్. మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. మసూద సినిమాతో హీరోగా మారి మంచి హిట్ కొట్టాడు. ఆ తర్వాత పరేషాన్ సినిమాతో మరోసారి మెప్పించాడు. ప్రస్తుతం తిరువీర్(Thiruveer) హీరోగా సినిమాలు చేస్తూనే పలు సినిమాల్లో కీలక పత్రాలు చేస్తున్నాడు.
తిరువీర్ గతేడాది కల్పన అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు తిరువీర్ తండ్రి కాబోతున్నాడు. తిరువీర్ భార్య కల్పన ప్రస్తుతం ప్రగ్నెంట్ కాగా ఘనంగా సీమంతం నిర్వహించారు.
Also Read : Sushmita Konidela : మా ఇద్దరి మధ్య గొడవలకు కారణం పవన్ బాబాయే.. చిరు కూతురు ఆసక్తికర వ్యాఖ్యలు..
మసూద సినిమాలో తిరువీర్ కి జంటగా నటించిన కావ్య కళ్యాణ్ రామ్ నిన్న సోమవారం నాడు ఈ సీమంతం వేడుకకు వెళ్లి తిరువీర్ జంటతో దిగిన ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం తెలిసింది. దీంతో తిరువీర్ కు కంగ్రాట్స్ చెప్తున్నారు.
Also Read : Rajinikanth : పవన్ కళ్యాణ్ గురించి.. రజినీకాంత్ సునీల్ కి ఏం చెప్పారో తెలుసా..?