కత్రినా కైఫ్ సంవత్సరానికి రూ.23కోట్లు.. ఎలా ఖర్చు పెడుతుందో తెలుసా

కత్రినా కైఫ్ సంవత్సరానికి రూ.23కోట్లు.. ఎలా ఖర్చు పెడుతుందో తెలుసా

Updated On : July 17, 2020 / 6:21 PM IST

బాలీవుడ్ లోకి 2003లో ఎంట్రీ ఇచ్చిన కత్రినా కైఫ్ సంపాదన.. 2019లో రూ.23కోట్లు. దేశంలో అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్లలో కత్రినా ఒకరు. సినిమాలు మాత్రమే కాదు, మేకప్ బ్రాండ్ తో పాటు మరికొన్ని బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న కత్రినా 2019 ఫోర్బ్స్ జాబితాలో టాప్ 100లో 23 వ స్థానాన్ని దక్కించుకుంది. ఇది కొత్తేం కాదు 2017 నుంచి ఫోర్బ్స్ లిస్టులో కొనసాగుతూనే ఉంది కత్రినా.

2019లో సల్మాన్ ఖాన్ తో పాటు కత్రినా భరత్ మూవీలో యాక్ట్ చేసింది. ఆ సినిమా కలెక్షన్లు బాక్సాఫీసు వద్ద రూ.300కోట్లు పైమాటే. రాబోయే ప్రాజెక్టులు సూర్యవంశీలో అక్షయ్ కుమార్, గుల్షన్ గ్రోవర్, అభిమన్యు సింగ్, నిహారికా రైజదా, జాకీ ష్రాఫ్ లతో పాటు కనిపించనుంది.

సినిమాలతో పాటు ప్రత్యేక బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న కత్రినా.. 2019లోనే రీబక్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. ట్రాపికనా, లెన్స్ కార్ట్, మెట్రో షూస్, ఒప్పోలకు కత్రినానే అంబాసిడర్. ఈ ఆరు బ్రాండ్ల వల్ల వచ్చే ఆదాయం కత్రినాకు వచ్చే ఆదాయంలో 40శాతం కంటే ఎక్కువే వస్తుంది.

కత్రినా తన బిజినెస్ స్కిల్స్ చూపించి కే బ్యూటీ అనే మేకప్ బ్రాండ్ ను మొదలుపెట్టింది. పెదాలకు, కళ్లకు మాత్రమే ఉపయోగించి మరో బ్రాండ్ అయినా నైకా గురించి ప్రియాంక చోప్రా, అర్జున్ కపూర్ అంతా సోషల్ మీడియా ప్లాట్ ఫాంలపై వీటి గురించి కామెంట్లు కూడా చేశారు.

మరి, ఈ డబ్బు అంతా ఎక్కడ ఖర్చు పెడుతుంది:
కైఫ్ తన డబ్బంతా ఇంటికే వెచ్చిస్తుందట. ముంబైలోని అంధేరీలో ఇల్లు కొనుక్కున్న క్యాట్.. ను ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అయితే లాఫ్ట్ స్టైల్ అపార్ట్‌మెంట్ గురించి.. అక్కాచెల్లెళ్లు సరదాగా దిగే ఫొటోల గురించి మనకూ ఓ ఐడియా వస్తుంది. కత్రినాకు కార్లంటే కూడా మోజేనట. కొద్ది నెలల క్రితమే రూ.2.65కోట్లు ఖర్చు పెట్టి రేంజ్ రోవర్ తీసుకుందట. ఆమె గ్యారేజిలో ఆడి క్యూ7 కార్ ఆల్రెడీ ఉందట.