Three Actresses To Grace Unstoppable 2 Next Episode
Unstoppable 2: నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ 2 టాక్ షో ప్రేక్షకుల్లో ఎలాంటి ఆసక్తిని క్రియేట్ చేస్తుందో, ఈ షోకు సంబంధించిన ప్రోమోలు, వీడియోలు రిలీజ్ అయినప్పుడు మనం చూస్తున్నాం. అయితే ఈ టాక్ షో తాజా ఎపిసోడ్‌కు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వస్తుండటంతో ఈ ఎపిసోడ్‌ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక త్వరలోనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా ఈ షోకు రాబోతున్నారనే వార్త ఇటీవల సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.
Unstoppable 2: పవన్‌తో బాలయ్య అన్‌స్టాపబుల్ ముచ్చట.. ఆ రోజేనా?
ఈ టాక్ షో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉండగా, తాజాగా ఈ టాక్ షో నెక్ట్స్ ఎపిసోడ్‌కు రాబోయే గెస్టుల గురించి ఆహా క్లూ ఇచ్చింది. అన్ స్టాపబుల్ 2 టాక్ షోలో ఏకంగా ముగ్గురు ఆడవాళ్లు సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ జయసుధ, జయప్రదలతో పాటు యంగ్ బ్యూటీ రాశి ఖన్నా ఈ టాక్ షోలో గెస్టులుగా రాబోతున్నట్లు ఆహా తన సోషల్ మీడియాలో క్లూ ఇచ్చింది.
ఇక బాలయ్య ఈ ముగ్గురితో ఎలాంటి ఆసక్తికర విషయాలను చర్చిస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి అన్‌స్టాపబుల్ 2 టాక్ షోలో బాలయ్యతో ఈ హీరోయిన్లు ఎలాంటి సందడి చేయబోతున్నారో తెలియాలంటే ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యేవరకు వెయిట్ చేయాల్సిందే.
Next week on #UnstoppableWithNBKS2
Three beautiful and talented actresses to grace the show. Comment below your guesses…?#NBKOnAHA #NandamuriBalakrishna pic.twitter.com/RvEgTLT2bs— ahavideoin (@ahavideoIN) December 18, 2022