Shakhahaari : కన్నడలో హిట్ మూవీ తెలుగు ఓటీటీలో.. ‘శాకాహారి’ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పట్నించి అంటే..

మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ గా శాకాహారి సినిమా తెరకెక్కింది.

Shakhahaari : కన్నడలో హిట్ మూవీ తెలుగు ఓటీటీలో.. ‘శాకాహారి’ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పట్నించి అంటే..

Thriller Kannada Movie Shakhahaari Streaming in Telugu OTT Details Here

Updated On : August 23, 2024 / 11:21 PM IST

Shakhahaari : ఇటీవల ఆహా ఓటీటీలో వరుసగా మంచి మంచి డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లోని మంచి సినిమాలను డబ్బింగ్ చేసి ఆహాలో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా మరో కన్నడ సినిమాని ఆహా ఓటీటీలో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. గోపాలకృష్ణ దేశ్ పాండే, వినయ్, నిధి హెగ్డే, హరిణి శ్రీకాంత్.. పలువురు ముఖ్య పాత్రలతో సందీప్ సుంకడ్ దర్శకత్వంలో కన్నడలో తెరకెక్కిన సినిమా శాకాహారి.

మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ గా శాకాహారి సినిమా తెరకెక్కింది. ఈ కన్నడ సినిమాని హనుమాన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత బాలు చరణ్ తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో మెయిన్ పాత్రకు సీనియర్ నటుడు గోపరాజు రమణతో డబ్బింగ్ చెప్పించారు.

Also Read : Viraaji : ఓటీటీలోకి వచ్చిన ఒక్కరోజులోనే అదిరిపోయే వ్యూస్.. ‘విరాజి’ సక్సెస్ మీట్..

ఇక ఈ శాకాహారి సినిమా ఆహా ఓటీటీలో ఆగస్టు 24 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. తాజాగా దీనికి సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ చేసారు.