Thug Life: ‘థగ్‌ లైఫ్‌’ సినిమా ట్రైలర్‌ విడుదల.. అదరగొట్టేసిన కమల్

ఈ ట్రైలర్‌లో పలు యాక్షన్ సీన్లతో పాటు సెంటిమెంట్‌ సీన్లను కూడా చూపారు.

కమల హాసన్‌, మణిరత్నం కాంబోలో రూపుదిద్దుకుంటున్న ‘థగ్‌ లైఫ్‌’ సినిమా ట్రైలర్‌ను ఆ సినిమా యూనిట్ ఇవాళ విడుదల చేసింది. ఈ ట్రైలర్‌లో పలు యాక్షన్ సీన్లతో పాటు సెంటిమెంట్‌ సీన్లను కూడా చూపారు.

Also Read: గుడ్‌న్యూస్‌.. ఆగస్టు 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం: చంద్రబాబు ప్రకటన

గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. 36 సంవత్సరాల తర్వాత కమల్‌, మణిరత్నం కాంబినేషన్‌లో సినిమా వస్తోంది. ఈ సినిమాను రాజ్‌కమల్‌ ఇంటర్నేషనల్‌ ఫిలిమ్స్, మద్రాస్‌ టాకీస్‌ నిర్మిస్తున్నాయి.

ఇందులో హీరోయిన్‌గా త్రిష నటిస్తోంది. జోజు జార్జ్‌, గౌతమ్‌ కార్తీక్‌, ఐశ్వర్య లక్ష్మి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. పాన్‌ ఇండియా సినిమాగా ‘థగ్‌ లైఫ్‌’ను రూపుదిద్దుతున్నారు. ఈ సినిమా జూన్‌ 5న విడుదల కానుంది.