Tiger 3 gave warnig to NTR Hrithik Roshan War 2
War 2 : ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి ‘వార్ 2’ సినిమాలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఈ మూవీ షూటింగ్ కూడా మొదలయ్యి.. హీరోలు లేకుండానే ఒక షెడ్యూల్ ని పూర్తి చేసేసుకుంది. అయాన్ ముఖర్జీ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక మొన్నటి వరకు ఈ సినిమా సెట్స్ లోకి ఎన్టీఆర్ ఎప్పుడు ఎంట్రీ ఇస్తారా అని నందమూరి అభిమానులంతా ఎంతో ఆశగా ఎదురు చూశారు. అయితే టైగర్ 3 సినిమా తరువాత ఇప్పుడు ఒక విషయం ఎన్టీఆర్ అభిమానులను భయపెడుతుంది.
దీపావళి కానుకగా థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ని పెద్దగా ఆకట్టుకోలేకపోతుంది. ఈ మూవీ యాష్ రాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ యూనివర్స్ ఈ ఏడాది ఆడియన్స్ ముందుకు వచ్చిన పఠాన్ ఎంతటి విజయం అందుకుందో అందరికి తెలిసిందే. దీంతో ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్ వంటి స్టార్స్ గెస్ట్ రోల్ ఉండడం కూడా విశేషం. కానీ ఇవేవి ఆడియన్స్ ని పెద్దగా ఆకట్టుకోవడం లేదు. దీనికి కారణం దర్శకుడే అని చెబుతున్నారు.
Also read : Virat Kohli : సచిన్ రికార్డు బ్రేక్ చేసిన కోహ్లీ.. టాలీవుడ్ సెలబ్రిటీస్ ట్వీట్స్..
ప్రేమ కథలు అనుభవం ఉన్న దర్శకుడు మనీష్ శర్మకి ఇలాంటి యాక్షన్ మూవీ ఇవ్వడం తప్పుబడుతున్నారు. ఇప్పుడు వార్ 2 తెరకెక్కిస్తున్న అయాన్ ముఖర్జీ కూడా ప్రేమ కథలు అనుభవం ఉన్న దర్శకుడే. బ్రహ్మాస్త్ర సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చినప్పటికీ యాక్షన్ డైరెక్టర్ గా మెప్పించలేకపోయారు. దీంతో ఈ దర్శకుడు కూడా మనీష్ శర్మ చేసినట్లే చేస్తారని.. ఇటు ఎన్టీఆర్ అభిమానులు, అటు హృతిక్ రోషన్ అభిమానులు కలవర పడుతున్నారు. మరి అయాన్ అభిమానులను సంతోష పరుస్తారా..? నిరాశ పరుస్తారా..? అనేది చూడాలి.