Tiger Vs Pathaan : వార్ డైరెక్టర్ తో టైగర్ వర్సెస్ పఠాన్ సినిమా.. వరుస అప్డేట్స్ తో YRF స్పై యూనివర్స్.. ఖుషీలో ఫ్యాన్స్..

తాజాగా టైగర్ వర్సెస్ పఠాన్ సినిమా గురించి అప్డేట్ ఇచ్చారు. టైగర్ v/s పఠాన్ (Tiger Vs Pathaan) టైటిల్ బట్టే ఈ సినిమాలో షారుఖ్ అండ్ సల్మాన్ ఒకరితో ఒకరు పోటీ పడబోతున్నట్లు తెలుస్తుంది.

Tiger Vs Pathaan movie director by Siddarth Anand (Photo : Twitter/ Taran Adarsh)

Tiger Vs Pathaan :  ఇటీవల ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మేకర్స్ అంతా ఒక సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. హాలీవుడ్(Hollywood)లో ఉన్నట్టే ఇక్కడ కూడా ఒక యూనివర్స్ లో సినిమాలు చేయాలని అనుకుంటున్నారు. తమిళ్(Tamil) లో లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) ఇది మొదలుపెట్టడంతో ఇప్పుడు అందరూ ఇదే ఫాలో అవుతున్నారు. ఇక బాలీవుడ్(Bollywood) లో స్టార్ ప్రొడక్షన్ కంపెనీ యష్ రాజ్ ఫిలిమ్స్ (Yash Raj Films) కూడా ఇటీవల తమ సినిమాటిక్ యూనివర్స్ కి తెర లేపారు. ఈ నిర్మాణ సంస్థలో ఇప్పటికే వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్స్ Ek Tha Tiger, Tiger Zinda Hai, War, పఠాన్(Pathaan) సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి.

పఠాన్ సినిమాలో టైగర్ సిరీస్ లోని సల్మాన్ క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేసి స్పై యూనివర్స్ మొదలు పెట్టారు. ఇప్పుడు ఈ యూనివర్స్ లో వచ్చే తదుపరి ప్రాజెక్ట్స్ టైగర్ 3, వార్ 2, టైగర్ v/s పఠాన్.. అనే సినిమాలను ఇటీవల ప్రకటించారు. ఆల్రెడీ టైగర్ 3 మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. వార్ సీక్వెల్ ఈ ఏడాది చివరిలో మొదలవ్వనుంది. దీంతో బాలీవుడ్ ఫ్యాన్స్, షారుఖ్, సల్మాన్, హృతిక్ ఫ్యాన్స్ సంతోషం వ్యఖం చేస్తున్నారు.

War 2 : వార్ 2 అనౌన్స్ చేసిన హృతిక్.. టైగర్‌తో స్పై యూనివర్స్‌లోకి ఎంట్రీ షురూ..

బుధవారం నాడు వార్ 2 సినిమాలో హృతిక్ తో పాటు ఎన్టీఆర్ కూడా ఉండొచ్చు అని బాలీవుడ్ మీడియా రాయడంతో ఈ వార్త వైరల్ గా మారింది. ఎన్టీఆర్ అభిమానులు కూడా దీనిపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక వార్ 2 సినిమాని బ్రహ్మాస్త్ర డైరెక్టర్ ఆయన ముఖర్జీ తెరకెక్కిస్తాడని ప్రకటించారు. తాజాగా టైగర్ వర్సెస్ పఠాన్ సినిమా గురించి అప్డేట్ ఇచ్చారు. టైగర్ v/s పఠాన్ (Tiger Vs Pathaan) టైటిల్ బట్టే ఈ సినిమాలో షారుఖ్ అండ్ సల్మాన్ ఒకరితో ఒకరు పోటీ పడబోతున్నట్లు తెలుస్తుంది. పఠాన్ సినిమాలో వీరిద్దరూ కేవలం 5 నిమిషాలు కనిపించినందుకే బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ క్రియేట్ అయ్యింది. దీంతో ఈ టైగర్ v/s పఠాన్ ప్రాజెక్ట్ పై ఆడియన్స్ లో భారీ హైప్ నెలకొంది. తాజాగా ఈ సినిమాని వార్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తాడని తెలుస్తుంది. జనవరి 2024లో ఈ సినిమా మొదలవ్వనుందని సమాచారం.

Tiger Vs Pathaan : స్పై యూనివర్స్ మూవీస్ అనౌన్స్ చేసిన యష్ రాజ్ ఫిలిమ్స్..

ఇప్పటికే సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా కూడా ఉంది. మరి ఈ స్పై యూనివర్స్ లోకి ప్రభాస్ ని ఏమన్నా తీసుకొస్తారేమో చూడాలి. వార్ సీక్వెల్ కి వేరే డైరెక్టర్ ఇచ్చి, టైగర్ v/s పఠాన్ సినిమాకు వార్ డైరెక్టర్ ని తీసుకొచ్చి.. ఇలా సినిమాలని మాత్రమే కాకా డైరెక్టర్స్ ని కూడా మార్చి మరింత ఆసక్తి కలగచేస్తున్నారు యష్ రాజ్ ఫిలిమ్స్. ఈ వరుస స్పై యూనివర్స్ అప్డేట్స్ తో ఈ హీరోల అభిమానులు, బాలీవుడ్ ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి యష్ రాజ్ ఫిలిమ్స్ భారీగానే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.