Tik Tok Bhanu
Tik Tok Bhanu : టిక్ టాక్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ తో ఫేమ్ తెచ్చుకున్న భాను అనంతరం పలు టీవీ షోలలో కూడా పాల్గొని పాపులర్ అయింది. ఇటీవల చదువుకోడానికి లండన్ వెళ్లడంతో కొన్నాళ్ళు ఎవరికీ కనపడలేదు. తాజాగా భాను మొదటిసారి ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో తన గురించి బోలెడన్ని విషయాలు చెప్పింది.(Tik Tok Bhanu)
ఈ క్రమంలో తనకు హీరోయిన్ అవకాశాలు వస్తే చేస్తావా? సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ చేస్తావా అని అడగ్గా భాను ఆసక్తికర సమాధానం చెప్పింది.
Also Read : Tik Tok Bhanu : టిక్ టాక్ భాను లవ్ స్టోరీ.. పదేళ్లు లవ్.. ఫస్ట్ అన్నయ్య అని పిలిచి.. పెళ్లి ఎప్పుడంటే..?
టిక్ టాక్ భాను మాట్లాడుతూ.. నేను హీరోయిన్ గా చేయను. చేయాలని లేదు కూడా. సినిమాల్లో లిప్ లాక్, రొమాంటిక్ సీన్స్ నాకు కంఫర్ట్ కాదు. అవి చేసే వాళ్ళను నేను తప్పు పట్టను, అది వాళ్ళ ఇష్టం. నాకు అయితే కంఫర్ట్ లేదు అందుకే చేయను. చెల్లి, అక్క, కూతురు.. లాంటి పాత్రలు వస్తే చేస్తాను. నేను డబ్బులు కోసం ఈ ఫీల్డ్ కి రాలేదు. దీని మీదే బతకాలని నాకు లేదు. ఛాన్సులు వస్తే అవి నాకు కంఫర్ట్ గా ఉంటేనే చేస్తాను. ఆల్రెడీ నేను కొన్ని ఛాన్సులు వస్తే నో చెప్పాను. రీల్స్ చేసేది నేను సినిమా ఛాన్సుల కోసం కాదు. నాకు నచ్చి చేసుకుంటున్నాను. డబ్బుల కోసం కూడా సినిమాలు చేయను అని తెలిపింది.