Tik Tok Bhanu : టిక్ టాక్ భాను లవ్ స్టోరీ.. పదేళ్లు లవ్.. ఫస్ట్ అన్నయ్య అని పిలిచి.. పెళ్లి ఎప్పుడంటే..?
ఈ క్రమంలోనే టిక్ టాక్ భాను తన లవ్ స్టోరీ కూడా తెలిపింది. (Tik Tok Bhanu)

Tik Tok Bhanu
Tik Tok Bhanu : టిక్ టాక్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ తో ఫేమ్ తెచ్చుకున్న భాను అనంతరం పలు టీవీ షోలలో కూడా పాల్గొని పాపులర్ అయింది. అయితే మధ్యలో చదువుకోడానికి లండన్ వెళ్లడంతో టీవీ షోలకు దూరమయింది. సోషల్ మీడియాలో తన పేరు భాను అయినా అసలు పేరు బాల భార్గవి. భాను మొదటిసారి ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది.
ఈ ఇంటర్వ్యూలో తన లైఫ్ గురించి అనేక విషయాలు తెలిపింది. ఈ క్రమంలోనే తన లవ్ స్టోరీ కూడా తెలిపింది.
Also See : Rashmika Mandanna : ‘థామా’ తెలుగు ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. నలుపు చీరలో మెరిసిన రష్మిక మందన్న..
భాను తన లవ్ స్టోరీ గురించి చెప్తూ.. మాది పదేళ్ల రిలేషన్ షిప్. గుడ్ రిలేషన్ లో ఉన్నాము. ఇంకొక సంవత్సరంలో పెళ్లి జరగొచ్చు. మా అమ్మ ఒక గుడి కడుతున్నారు. అది అయ్యాక మా పెళ్లి జరగొచ్చు. ఇంటర్ లో ఫ్రెండ్ కి ఫ్రెండ్ గా పరిచయం అయ్యాడు. మొదట అన్నయ్య అని పిలిచాను. అన్నయ్య అనే పిలుస్తాను అన్నాను. అతను వద్దు, అలా పిలవద్దు అన్నాడు. అలా పరిచయం అయి తర్వాత ఫ్రెండ్స్ అయి ప్రేమించుకున్నాము. ఒకర్నొకరు అర్ధం చేసుకున్నాం కాబట్టే ఇన్నేళ్లు ఉన్నాము. నా ప్రేమ విషయంలో మాత్రం దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటాను అని తెలిపింది.
Also Read : Rajasaab Trailer : ప్రభాస్ ‘రాజాసాబ్’ ట్రైలర్ వచ్చేసింది.. హారర్ కామెడీతో అదరగొట్టేసారుగా..