Tillu Square
Tillu Square : సిద్దు జొన్నలగడ్డ-అనుపమ పరమేశ్వరన్ జంటగా వస్తున్న ‘టిల్లు స్క్వేర్’ మూవీ ఫైనల్‌గా రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ విషయాన్ని అనుపమ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు.
Chiranjeevi : పద్మ విభూషణ్ అవార్డు పై స్పందించిన చిరంజీవి
సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ‘డీజే టిల్లు’ సినిమా సీక్వెల్‌గా నిర్మించిన ‘టిల్లు స్క్వేర్’ ఎట్టకేలకు మార్చి 29న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌కి రెడీ అయ్యింది. గతంలో ఈ సినిమా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సిద్దు అభిమానులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. విడుదల తేదీని ప్రకటిస్తూ మూవీ టీమ్ ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. అనుపమ పరమేశ్వరన్ తన సోషల్ మీడియాలో ఈ పోస్టర్‌ని షేర్ చేసారు.
Komatireddy Venkat Reddy : చిరంజీవికి మంత్రి కోమటిరెడ్డి సత్కారం.. భారతరత్న కూడా రావాలని
DJ టిల్లు సినిమా మొదటి పార్ట్ ఫుల్ ఎంటర్టైన్ చేసింది. టిల్లు స్క్వేర్ కూడా అంతకంటే ఎక్కువ వినోదాన్ని పంచుతుందని అభిమానులు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. మొదటగా గతేడాది ఆగస్టు 11న సినిమా విడుదల అన్నారు. ఆ తర్వాత సెప్టెంబర్ 15.. చివరికి ఈ ఏడాది మార్చి 29న సినిమా విడుదల అవుతోంది. మల్లిక్ రామ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. మొదట ఈ సినిమా ఫిబ్రవరి 9న రిలీజ్ చేయాలని భావించినా ఆ డేట్‌లో రవితేజ ఈగల్ రిలీజ్ ఉండటంతో టిల్లు స్క్వేర్ మార్చి 29 కి మార్చారని తెలుస్తోంది.