Trivikram
Trivikram : ఇటీవల అందరూ దేవుళ్ళు, పురాణాలకు సంబంధించిన కథలపై ఆసక్తి చూపుతూ వాటినే సినిమాలుగా మలుస్తున్నారు. ఈ క్రమంలో ఫ్యామిలీ సినిమాలు తీసే త్రివిక్రమ్ కూడా సుబ్రహ్మణ్య స్వామి కథతో సినిమా తీయబోతున్నట్టు ప్రకటించారు. ఆ సినిమా మొదట అల్లు అర్జున్ తో అన్నా ఆ తర్వాత ఎన్టీఆర్ తో తీస్తున్నారని వార్తలు వచ్చాయి.(Trivikram)
అయితే తాజాగా దర్శకుడు తిరుమల కిషోర్ సుబ్రహ్మణ్య స్వామి కథతో సినిమా తీయబోతున్నాడని చెప్పారు. నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, చిత్రలహరి.. లాంటి సినిమాలతో మెప్పించిన తిరుమల కిషోర్ ఈ సంక్రాంతికి రవితేజ తో భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ వస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తిరుమల కిషోర్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన నెక్స్ట్ సినిమా గురించి చెప్పుకొచ్చారు.
Also Read : Narasimha Reunion : నరసింహ రీ యూనియన్.. ఒకే ఫ్రేమ్ లో రజినీకాంత్, రమ్యకృష్ణ.. ఫొటోలు వైరల్..
తిరుమల కిషోర్ మాట్లాడుతూ.. నెక్స్ట్ మైథలాజికల్ సినిమా, మున్నాభాయ్ ఎంబిబిఎస్ లాంటి కథలు ఉన్నాయి. సుబ్రహ్మణ్య స్వామి మీద ఒక సినిమా రాసుకున్నాను. రెండేళ్లు దాని మీద రీసెర్చ్ చేశాను. నాలుగేళ్ళ క్రితమే ఆ సినిమా అనుకున్నాను. త్రివిక్రమ్ గారు గాడ్ ఆఫ్ వార్ అని అనౌన్స్ చేసారు. అది ఎలా ఉంటుందో తెలీదు. నా దాంట్లో మాత్రం పార్వతి దేవి సుబ్రమణ్య స్వామితో ఎక్కువ కథ ఉంటుంది. తల్లి కొడుకు ఎమోషన్ మీద ఉంటుంది ఈ సినిమా.
నేను సుబ్రహ్మణ్య స్వామి మాల వేసుకొని 41 రోజులు అన్ని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్ కి వెళ్ళాను. పళని లో వారం రోజులు ఉన్నాను. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఒక కల్చర్ తీసుకొని ఈ కథ రాసాను. ఒక రెండేళ్లు కష్టపడ్డా ఆ స్క్రిప్ట్ మీద. నేను నెక్స్ట్ అదే సినిమా చేద్దాం అనుకుంటున్నాను. కానీ పెద్ద బడ్జెట్ అవుతుంది. హీరో ఎవరు ఇంకా ఫైనల్ అవ్వలేదు. చూడాలి మరి అన్నారు.
Also Read : Rashi Singh : రాశి సింగ్ బర్త్ డే సెలబ్రేషన్స్.. గోవాలో ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్.. ఫొటోలు..
దీంతో త్రివిక్రమ్, తిరుమల కిషోర్ ఈ ఇద్దరు దర్శకుల్లో సుబ్రహ్మణ్య స్వామి కథతో ఎవరు ముందు సినిమా తీస్తారో అని చర్చగా మరింది. ఇద్దరూ సుబ్రహ్మణ్య స్వామి కథే చెప్తే డిఫరెన్స్ ఏం చూపిస్తారు, సినిమాలో ఏం ఉండబోతుంది అని ఆలోచిస్తున్నారు. త్రివిక్రమ్ ప్రస్తుతం వెంకటేష్ తో సినిమా చేస్తున్నారు. అది అయ్యాక ఎన్టీఆర్ తో లేదా అల్లు అర్జున్ తో సుబ్రహ్మణ్య స్వామి సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. మరి ఈ లోపే తిరుమల కిషోర్ సినిమా హీరో ఫైనల్ చేసి అధికారికంగా అనౌన్స్ చేస్తారా చూడాలి.