Tirupati Prakash Emotional Comments regarding Movie Chances
Tirupati Prakash : చాలామంది సీనియర్ ఆర్టిస్టులకు ఇప్పుడు సరైన అవకాశాలు రావట్లేదు. దీంతో కొంతమంది ఆర్టిస్టులు తమకు అవకాశాలు రావట్లేదని, ఇవ్వట్లేదని బాధపడుతున్నారు. ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా దాదాపు 300 లకు పైగా సినిమాల్లో నటించిన తిరుపతి ప్రకాష్ ప్రస్తుతం అవకాశాలు లేక కాఫీ పొడి షాప్ నడుపుకుంటున్నాడు. అప్పుడప్పుడు సీరియల్స్ లో ఛాన్సులు వస్తే చేసుకుంటున్నాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తిరుపతి ప్రకాష్ మాట్లాడుతూ తనకు అవకాశాలు రావట్లేదని బాధపడ్డారు. అంతేకాక ఇప్పుడు ఇండస్ట్రీలో సిస్టమ్ మొత్తం మారిపోయిందని విమర్శలు చేసారు. కొంతమంది దర్శకులపై కూడా పేర్లు చెప్పకుండా విమర్శలు చేసారు.
Also Read : Anasuya : అనసూయ వస్తుందని.. ఏకంగా ఆర్టీసీ బస్టాండ్‌నే మూసేసారు.. మండిపడ్డ ప్రయాణికులు..
తిరుపతి ప్రకాష్ మాట్లాడుతూ.. 300 లకు పైగా సినిమాల్లో కమెడియన్ గా చేసాను. కానీ ఇప్పుడు అవకాశాలు రావట్లేదు. ఒకప్పుడు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, కో డైరెక్టర్స్ ని డైరెక్ట్ గా కలిసి మాట్లాడి అవకాశాల గురించి అడిగేవాళ్ళం. ఇప్పుడు ఆఫీస్ బయట సెక్యూరిటీ వాడే ఆపేస్తున్నాడు. మధ్యలో కొత్తగా క్యాస్టింగ్ డైరెక్టర్ వచ్చారు. ఇప్పుడు కూడా ఆఫీసుల చుట్టూ తిరిగి అవకాశాలు లేవు అనిపించుకున్నాను. ఓ పెద్ద డైరెక్టర్ ని కలుద్దామని ఒక ఆఫీస్ కి వెళ్తే డైరెక్టర్ లేరు క్యాస్టింగ్ డైరెక్టర్ ని కలవమన్నారు. అతను నా ఫోటోలు అడిగాడు, నేను చేసిన సినిమాలు, వీడియోలు అడిగాడు. అన్ని పంపించాను. 300 సినిమాలు చేసి కూడా అడిగినా నేను బాధపడలేదు. కానీ డైరెక్టర్ ఉన్నా లేరని చెప్పారు. నేను బయటకి వచ్చేటప్పుడు డైరెక్టర్ ఓ రైటర్ తో బయట నిల్చొని మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు డైరెక్టర్ ని డైరెక్ట్ గా కలిసేవాళ్ళం. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. మధ్యలో చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు నేను చేసిన సినిమాలకు అసిస్టెంట్, అసోసియేట్ డైరెక్టర్స్ చేసిన వాళ్ళు ఇప్పుడు డైరెక్టర్స్. అప్పుడు నాతో సిగరెట్ తాగుతూ ఛాన్సులు ఇస్తాము అన్నవాళ్ళు ఇప్పుడు కనీసం పట్టించుకోవట్లేదు. అప్పుడు నా కోసం పాత్రలు రాసినవాళ్లు ఇప్పుడు రాయలేకపోతున్నారు. వేషం ఇవ్వకపోయినా పర్లేదు కానీ వచ్చినందుకు ఒకసారి కలిసి మాట్లాడొచ్చు కదా. ఓ రెండు నిముషాలు మాట్లాడట్లేదు. వేంకటేశ్వరస్వామి దర్శనం అయినా అవుతుందేమో కానీ ఇప్పటి డైరెక్టర్స్ దర్శనం కష్టమే. ఒక్క బోయపాటి గారు మాత్రం పిలిచి మాట్లాడి నేను యాక్షన్ సినిమాలే చేస్తున్నాను, నా సినిమాల్లో కామెడీకి ఛాన్స్ లేదు. ఉంటే పాత్ర ఇస్తాను అని చెప్పారు అంటూ ఎమోషనల్ అయ్యారు. ఇప్పటికి అవకాశాలు వస్తే చేస్తాను అని తెలిపారు.