Jailer
Jailer : సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) భాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar) దర్శకత్వంలో రజినీకాంత్ నటించిన చిత్రం ‘జైలర్’(Jailer). తమన్నా (Tamannaah), కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Shiva Rajkumar), మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohanlal), జాకీ ష్రాఫ్, కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో పాటు ఈ మొదటి రోజు నుంచే కలెక్షన్లలో దుమ్ములేపుతోంది.
శనివారం సాయంత్రానికి ‘జైలర్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.500 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాల తెలిపారు. తమిళంలో ఈ ఘనత సాధించిన మూడో సినిమాగా జైలర్ రికార్డులను నెలకొల్పింది. ఇప్పటి వరకు ‘రోబో 2.0’, ‘పొన్నియిన్ సెల్వన్’ మాత్రమే ఈ క్లబ్‌లో ఉండగా తాజాగా జైలర్ కూడా ఎంటరైంది. 500 కోట్ల క్లబ్‌లో ఎంటర్ అయిన రెండో ఫాస్టెస్ చిత్రంగా జైలర్ నిలిచింది. రోబో 2.0 కేవలం 7 రోజుల్లోనే దీన్ని సాధించింది.
BREAKING: #JailerHits500cr
?
?
?
?
?#Jailer BREACHES ₹5⃣0⃣0⃣ cr elite club at the World Wide Box Office in just 10 days.||#Rajinikanth | #ShivaRajKumar | #Mohanlal||
Becomes the THIRD movie from Tamil Cinema to enter this club after #2Point0 & #PonniyinSelvan.
Also,… pic.twitter.com/SZ5ZKe7Q5o
— Manobala Vijayabalan (@ManobalaV) August 19, 2023
ఇదిలా ఉంటే.. జైలర్ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 95 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. మొదటి వారంలో రూ.235.85 కోట్ల షేర్ రాబట్టింది. తమిళంలో రూ.184.65కోట్లు, తెలుగులో రూ.47.05కోట్లు, కన్నడలో రూ.2.05కోట్లు, హిందీలో రూ.2.1కోట్లు వసూలు చేసింది. ఇక తొమ్మిది రోజులకు రూ.244.85 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. నివేదికల ప్రకారం శనివారం 10వ రోజు ఈ చిత్రం దేశంలో మరో రూ.16కోట్లు రాబట్టవచ్చు. శనివారం వసూళ్లను కూడా కలుపుకుంటే రూ.261.60 కోట్లు దాటవచ్చునని నివేదికలు చెబుతున్నాయి.