Boys Hostel Trailer : ఆద్యంతం ఆకట్టుకుంటున్న ‘బాయ్స్ హాస్టల్’ ట్రైలర్.. రష్మీ గౌతమ్ అందాలకు ఫిదా..!
కన్నడలో ఘన విజయం సాధించిన యూత్‌పుల్ కామెడీ ఎంటర్టైనర్ ‘హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే’ చిత్రాన్ని తెలుగులో ‘బాయ్స్ హాస్టల్’ పేరుతో విడుదల చేస్తున్నారు.

Boys Hostel Rashmi
Boys Hostel Movie : కన్నడలో ఘన విజయం సాధించిన యూత్‌పుల్ కామెడీ ఎంటర్టైనర్ ‘హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే’ (Hostel Hudugaru Bekagiddare) చిత్రాన్ని తెలుగులో ‘బాయ్స్ హాస్టల్’ (Boys Hostel) పేరుతో విడుదల చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కలిసి ఈ చిత్రాన్ని ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.

rashmi gautam
ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. యువతకు కనెక్ట్ అయ్యే సన్నివేశాలు ఎక్కువగా కనిపించాయి. రష్మీ గౌతమ్ టీచర్‌గా నటించింది. రిషబ్ శెట్టి, పవన్ కుమార్, షైన్ శెట్టి, తరుణ్ భాస్కర్లు గెస్ట్ రోల్స్‌లో నటించారు. నితిన్ కృష్ణమూర్తి కన్నడలో ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ప్రజ్వల్ బిపి, మంజునాథ్ నాయక, రాకేష్ రాజ్‌కుమార్, శ్రీవత్స, తేజస్ జయన్న ఉర్స్ ప్రధాన పాత్రలు పోషించారు. వరుణ్ గౌడ, ప్రజ్వల్ అరవింద్ కశ్యప్‌లతో కలిసి గుల్మొహర్ ఫిలిమ్స్, వరుణ్ స్టూడియోస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు.
Allu Ayaan : అమ్మమ్మ, తాతయ్యలతో అల్లు అయాన్.. నల్గొండలో తనయుడు అయాన్‌తో బన్నీ సందడి..
ఇక తెలుగు ట్రైలర్ లాంఛ్ ఈ వెంట్లో రష్మి గౌతమ్ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్ వారం రోజుల్లోనే ఓకే అయ్యిందని, అంతే ఫాస్ట్‌గా షూటింగ్ పూర్తి అయినట్లు చెప్పింది. కన్నడలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉన్నట్లు తెలిపింది. మంచి సినిమాలో భాగం కావడం ఆనందాన్ని ఇచ్చినట్లు చెప్పింది.