Anchor Jhansi : రోడ్డు పై చెత్త సేకరిస్తున్న తెలుగు యాంకర్.. ఎందుకో తెలుసా..

టాలీవుడ్ లో యాంకర్ గా మంచి గుర్తింపుని సంపాదించుకున్న 'ఝాన్సీ'.. రోడ్డు పక్కన పడేసిన చెత్తని జాగ్రత్తగా సేకరించి తన కారులో తీసుకోని వెళ్లారు. ఆమె అలా ఎందుకు చేశారు.

Tollywood Actress and Anchor Jhansi collecting waste from road side video gone viral

Anchor Jhansi : టాలీవుడ్ లో యాంకర్ గా మంచి గుర్తింపుని సంపాదించుకున్న ‘ఝాన్సీ’.. నటిగా కూడా వెండితెర పై నటించి మెప్పించారు. గత ఏడాది వాల్తేరు వీరయ్య, దసరా, సలార్ వంటి సినిమాల్లో నటించారు. ఇక ఒకప్పుడు యాంకర్ గా బుల్లితెర పై తరుచు కనిపించిన ఝాన్సీ.. ప్రస్తుతం టెలివిజన్ లో కనిపించడమే మానేశారు. అయితే ట్రెండ్ కి తగ్గట్లు సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్ గా ఉంటున్నారు.

తన మూవీ షూటింగ్ విషయాలు గురించి, లైఫ్ స్టైల్ విషయాలు గురించి నెటిజెన్స్ కి టిప్స్ ఇచ్చేలా పోస్టులు చేస్తూ సోషల్ మీడియాలో ఆడియన్స్ కి దగ్గరగా ఉంటున్నారు. ఈక్రమంలోనే తాజాగా ఓ కొత్త వీడియోని పోస్టు చేశారు. ఆ పోస్టులో ఝాన్సీ రోడ్డు పై చెత్త సేకరిస్తూ కనిపించారు. రోడ్డు పక్కన పడేసిన చెత్తని జాగ్రత్తగా సేకరించి తన కారులో తీసుకోని వెళ్లారు. ఆమె అలా ఎందుకు చేశారు.

Also read : 12th Fail : ’12th ఫెయిల్’ ఇప్పుడు తెలుగులో కూడా.. ఏ ఓటీటీలో తెలుసా..!

ఇంతకీ ఆమె సేకరించిన చెత్త ఏంటంటే.. ఎండిపోయిన అరటి ఆకులు, అలాగే ఎండుగడ్డి. ప్రకృతి నుంచి వచ్చిన ఈ రెండు.. వ్యర్థపదార్దాలు కావు. ప్రకృతి నుంచి వచ్చిన ఏ పదార్థం అయినా.. అది నాశనం అయ్యేటప్పుడు కూడా మళ్ళీ అదే ప్రకృతికి సహాయ పడుతుంది. అది ప్రకృతిలో ఉన్న గొప్ప లక్షణం. ఈ విషయం అందరికి తెలిసిందే. చిన్నప్పుడు ప్రతిఒక్కరు దీని గురించి చదువుకునే ఉంటారు.

ఇప్పుడు ఇదే విషయాన్ని ఝాన్సీ మరోసారి తెలియజేస్తూ పోస్టు వేశారు. “ఎండి గడ్డిని, ఆకులను కాల్చి బూడిద చేయకండి. అవి మన మట్టికి చాలా ఉపయోగపడతాయి. అవి ప్రకృతి సమతౌల్య సూత్రం” అంటూ పేర్కొన్నారు. ఈ వీడియో మాత్రమే కాదు గతంలో ఆవు పేడని కూడా ప్రకృతి పద్దతిగా ఎలా ఉపయోగించాలి అనేది కూడా తెలియజేస్తూ వీడియోలు పోస్టు చేశారు. ఇక ఝాన్సీ చెప్పే ఈ విషయాలు పై నెటిజెన్స్ రియాక్ట్ అవుతూ.. ఆమెను అభినందిస్తున్నారు.