Prashanthi Harathi : 20 ఏళ్ళ తర్వాత మీడియా ముందుకు వచ్చిన నటి.. అమెరికా వెళ్ళిపోయాను మళ్ళీ ఛాన్సులు కావాలంటూ..

20 ఏళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇవ్వబోతున్న నటి. ఒకప్పుడు చిరంజీవి ఇంద్ర సినిమాలో..

Tollywood actress Prashanthi Harathi come back to tollywood and waiting for offers

Prashanthi Harathi : ఫిబ్రవరి 14 నెక్టెస్ రోడ్, రూపాయి, ఇంద్ర, పెళ్ళాం ఊరెళితే.. లాంటి పలు సినిమాలతో మెప్పించిన నటి ప్రశాంతి హారతి. పెళ్ళాం ఊరెళితే సినిమాలో సునీల్ పాత్రకి అమాయకపు భార్యగా నటించి అదరగొట్టింది. ఆ సినిమా 100 రోజులు ఆడింది. అప్పుడు చిరంజీవి చేతుల మీదుగా షీల్డ్ కూడా అందుకుంది. ఆ సినిమా తర్వాత అవకాశాలు వచ్చినా ఇంట్లో వాళ్ళు పెళ్లి చేయడంతో పెళ్లి చేసుకొని అమెరికా వెళ్లి సెటిల్ అయిపోయింది.

ప్రశాంతి చిన్నప్పట్నుంచి కూచిపూడి డ్యాన్సర్. అందులో మాస్టర్స్ కూడా చేసింది. క్లాసికల్ డ్యాన్స్ ఫోటోషూట్స్ వల్ల సినిమా ఛాన్సులు వచ్చాయి. పెళ్లి తర్వాత సినిమాలు ఆపేయడంతో అమెరికాలో అభినయ డ్యాన్స్ అకాడమీ ప్రారంభించి అక్కడి పిల్లలకు మన ఇండియన్ కల్చర్, కూచిపూడి డ్యాన్స్ గురించి నేర్పించడం మొదలుపెట్టారు. ఇన్నేళ్ళుగా అమెరికాలోనే కూచిపూడి నృత్యాన్ని వ్యాప్తి చేస్తున్నారు ప్రశాంతి. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఆవిడ టాలీవుడ్ కి వచ్చారు.

Also read : Venky 2 : 20ఏళ్ళ ‘వెంకీ’.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన దర్శకుడు.. సీక్వెల్‌..!

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంతి హారతి మాట్లాడుతూ.. అమెరికా వెళ్ళిపోయినా నా మనసు యాక్టింగ్ మీద ఉంది. ఇప్పుడు నా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. లైఫ్ అంతా సెటిల్ అయిపోయాను. అందుకే ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి రావాలనుకుంటున్నాను. అప్పటికి, ఇప్పటికి సినిమాల్లో చాలా తేడా వచ్చింది. ఇప్పుడు సినిమాలు, సీరియల్స్, ఓటీటీ, యూట్యూబ్.. ఎందులో నటించడానికైనా నేను సిద్దమే. ఎలాంటి పాత్ర అయినా ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది అంటే చేయడానికి రెడీగా ఉన్నాను. ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉంటాను. టాలీవుడ్ లో ఛాన్సుల కోసం ఎదురుచూస్తున్నాను అని తెలిపింది.

ఇక తన కూతురు తాన్య కూడా చిన్నప్పటినుంచి కూచిపూడి నేర్చుకుంది. ఇటీవలే VN ఆదిత్య గారి దర్శకత్వంలో తెలుగింటి సంస్కృతి అనే మ్యూజిక్ వీడియోలో నటించింది. తనకి కూడా సినిమాల్లో ఇంట్రెస్ట్ ఉంది. తన ఏజ్ కి తగ్గ మంచి అవకాశం వస్తే తనని కూడా సినిమాల్లోకి పంపిస్తాను అని ప్రశాంతి తెలిపింది. మరి 20 ఏళ్ళ తర్వాత సినీ పరిశ్రమకి వచ్చి మళ్ళీ ఛాన్సులు కావాలంటున్న ఈ నటి ప్రశాంతి హారతికి ఇప్పటి దర్శక నిర్మాతలు ఎవరైనా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశం ఇస్తారేమో చూడాలి.