Venky 2 : 20ఏళ్ళ ‘వెంకీ’.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన దర్శకుడు.. సీక్వెల్‌..!

20ఏళ్ళ పూర్తి చేసుకున్న రవితేజ 'వెంకీ'. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన దర్శకుడు శ్రీను వైట్ల.

Venky 2 : 20ఏళ్ళ ‘వెంకీ’.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన దర్శకుడు.. సీక్వెల్‌..!

Srinu Vaitla confirms Venky movie sequel with Raviteja starts soon

Updated On : March 26, 2024 / 2:48 PM IST

Venky 2 : రవితేజ హీరోగా దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన యాక్షన్ కామెడీ చిత్రం ‘వెంకీ’. ఈ సినిమాకి టాలీవుడ్ ఆడియన్స్ లో ఓ ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా ట్రైన్ సీక్వెన్స్ లో వచ్చే కామెడీ సీన్ ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయింది. రవితేజ, బ్రహ్మానందం, ఏవీఎస్, వేణుమాధవ్, శ్రీనివాస్ రెడ్డి, చిత్రం శ్రీను కలిసి చేసిన కామెడీ.. ఇప్పటి ఆడియన్స్ ని కూడా విపరీతంగా నవ్విస్తూ ఉంటుంది.

ఇక ఈ కామెడీ సీన్ టెంప్లేట్స్ తో మీమర్స్ క్రియేట్ చేసే మీమ్స్ మరింత గిలింతలు పెడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అందువలనే ఈ చిత్రానికి టాలీవుడ్ ఆడియన్స్ లో ఓ ప్రత్యేక స్థానం అలా ఉండిపోయింది. ఇటీవల ఈ మూవీని రీ రిలీజ్ చేస్తే.. థియేటర్స్ కి వెళ్లి ఓ రేంజ్ సందడి చేసారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

Also read : Game Changer : ‘గేమ్ ఛేంజర్’ పాన్ ఇండియా మూవీ కాదా..? కేవలం ఆ భాషల్లోనే రిలీజ్.. 

కాగా 2004లో రిలీజ్ అయిన ఈ సినిమా నేటితో 20ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. దీంతో టాలీవుడ్ ఫ్యాన్స్ మరోసారి ఈ చిత్రాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో మీమ్స్ అండ్ పోస్ట్స్ వేస్తూ వస్తున్నారు. అలాగే ఈ మూవీకి సీక్వెల్ ని తీసుకురావాలని ప్రేక్షకులు ఎప్పటినుంచో కోరుతూ వస్తున్నారు. తాజాగా ఈ సీక్వెల్ పై దర్శకుడు శ్రీను వైట్ల రియాక్ట్ అవుతూ.. ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసారు.

అభిమానులు కోరుకుంటున్న ఈ మూవీ సీక్వెల్ పనులను స్టార్ట్ చేసినట్లు శ్రీను వైట్ల తెలియజేసారు. త్వరలోనే ఈ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇక ఈ న్యూస్ కేవలం రవితేజ అభిమానులను మాత్రమే కాదు, టాలీవుడ్ ఆడియన్స్ ని కూడా సంతోష పరుస్తుంది. కాగా శ్రీను వైట్ల ప్రస్తుతం గోపీచంద్ తో సినిమా చేస్తున్నారు. రవితేజ ఏమో హరీష్ శంకర్ తో మూవీ చేస్తున్నారు.