Adipurush : ఆదిపురుష్ కోసం రూట్ క్లియర్ చేస్తున్న మేకర్స్.. హిందీ సినిమాలను కూడా పోస్ట్‌పోన్..

టాలీవుడ్ అండ్ బాలీవుడ్ లోని పలు మోస్ట్ అవైటెడ్ మూవీస్ అన్ని రిలీజ్ లు వాయిదా పడుతున్నాయి. దానికి రీజన్ ప్రభాస్ ఆదిపురుష్?

tollywood and bollywood movies postpone their release dates for Adipurush

Adipurush : రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న మైథిలాజికల్ మూవీ ఆదిపురుష్. హిందు పురాణాల్లోని రామాయణం కథాంశంతో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ (Kriti Sanon) సీతగా, సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) రావణాసురిడిగా నటిస్తున్నారు. టీసిరీస్, రెట్రోఫైల్స్ బ్యానర్ల నిర్మాణంలో ఓం రౌత్ దర్శకత్వంలో కంప్లీట్ బాలీవుడ్ సినిమాగా ఆదిపురుష్ తెరకెక్కుతుంది. కాగా ఈ సినిమా గ్రాఫిక్స్ విషయంలో చాలా ట్రోలింగ్ గురైన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా VFX వర్క్స్ కు మెరుగులు దిద్దెందుకు చిత్ర యూనిట్ వెనక్కి వెళ్ళింది.

Hanuman : రిలీజ్‌ని వెనక్కి తీసుకు వెళ్తున్న హనుమాన్.. కారణం ఆదిపురుష్?

ఇక ఈ మూవీని జూన్ 16న ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. అయితే ఈ సినిమా పై ఆడియన్స్ లో పెద్ద ఇంటరెస్ట్ కనిపించడం లేదు. దీంతో మేకర్స్ ఈ మూవీ రిలీజ్ కోసం రూట్ క్లియర్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ రిలీజ్ కి ముందు ఎటువంటి సినిమాలు లేకుండా చూసుకుంటున్నారు. ఆల్రెడీ మే 12న రిలీజ్ కావాల్సిన టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ హనుమాన్ ని పోస్ట్‌పోన్ చేశారు. గ్రాఫిక్స్ విషయంలో హనుమాన్ సినిమాని ఆదిపురుష్ తో పోలుస్తూ ఓం రౌత్ అండ్ టీంని ప్రభాస్ అభిమానులు విపరీతంగా ట్రోల్ చేశారు. ఇక ఆదిపురుష్ కంటే ముందే హనుమాన్ రిలీజ్ అయితే ఆదిపురుష్ కి ఇబ్బంది అయ్యే అవకాశం ఉండడం వల్లే ఆ చిత్రాన్ని పోస్ట్‌పోన్ చేయించ ఉండవచ్చని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Adipurush : ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్‌కి రంగం సిద్ధం.. స్పెషల్ స్క్రీనింగ్ థియేటర్ లిస్ట్ ఇదే..

తాజాగా ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్.. “హిందీ సినిమాల రిలీజ్ డేట్స్ లో చేంజ్స్ జరగబోతున్నాయి. ఈ వారంలో చేంజ్ అయిన రిలీజ్ డేట్స్ వివరాలు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది” అంటూ ట్వీట్ చేశాడు. ఈ రిలీజ్ డేట్స్ చేంజెస్ వెనుక ఉన్న అసలు నిజమేంటో తెలియదు గాని కొందరు నెటిజెన్లు మాత్రం.. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ టీసిరీస్ ఆదిపురుష్ ని నిర్మిస్తుండడంతోనే ఈ చేంజ్స్ అన్ని జరుగుతున్నాయి అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.