×
Ad

Chandra Mohan : చంద్రమోహన్ కి సినీ ప్రముఖుల నివాళులు..

సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా నివాళులు ప్రకటిస్తున్నారు.

  • Published On : November 11, 2023 / 02:26 PM IST

Tollywood celebrities paid tribute to Chandra Mohan

Chandra Mohan : తెలుగు, తమిళ్ లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలతో ప్రేక్షకులని మెప్పించిన నటుడు చంద్రమోహన్. వయో భారంతో గత కొంతకాలంగా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న చంద్రమోహన్ ఇటీవల గుండెకి సంబంధించిన ఆరోగ్య సమస్యలతో హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చేరగా నేడు నవంబర్ 11న ఉదయం 9.45 గంటలకు మరణించారు. దీంతో ఒక్కసారిగా సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా నివాళులు ప్రకటిస్తున్నారు. కొంతమంది ప్రముఖులు ఆయన ఇంటివద్దకు వెళ్లి భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్నారు.