×
Ad

Celebrity Cricket Carnival : ఆస్ట్రేలియాలో క్రికెట్ విజేతలుగా నిలిచిన టాలీవుడ్ స్టార్స్.. నెక్స్ట్ CCL మ్యాచ్..

ఆస్ట్రేలియాలో జరిగిన చారిటీ క్రికెట్ మ్యాచ్ లో టాలీవుడ్ స్టార్స్ విజేతలుగా నిలిచారు. ఇక నెక్స్ట్ CCL మ్యాచ్స్ కి సిద్ధమవుతున్నారు.

  • Published On : February 21, 2024 / 09:19 AM IST

Tollywood Celebrities won Celebrity Cricket Carnival match in melbourne australia

Celebrity Cricket Carnival : మన తెలుగు సినిమా స్టార్స్.. స్క్రీన్ పై అదరగొట్టడమే కాదు, క్రికెట్ పిచ్ పై కూడా తమ మాస్ చూపిస్తూ ఉంటారు. సంవత్సరానికి ఒకసారి సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL) అంటూ ఇండియాలోని ఇతర సినీ పరిశ్రమలతో లీగ్ మ్యాచ్ లు ఆడే మన టాలీవుడ్ ప్లేయర్స్.. ఈ మధ్యలో కొన్ని చారిటీ మ్యాచ్ లు ఆడుతూ తమ సేవా గుణాన్ని చాటుతూ ఉంటారు. తాజాగా అలా ఒక చారిటీ కోసం ఆడిన మ్యాచ్ ‘సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్’ (CCC).

ఆస్ట్రేలియాలో జరిగిన ఈ మ్యాచ్ లో మన తెలుగు హీరోలు.. అక్కడ నివసిస్తున్న తెలుగు ప్లేయర్స్ తో ఆడినట్లు తెలుస్తుంది. ఈ మ్యాచ్ లో టాలీవుడ్ నుంచి శ్రీకాంత్, తరుణ్, నిఖిల్, సుధీర్ బాబు, సందీప్ కిషన్, థమన్, సుశాంత్, ప్రిన్స్, ఆది, ఓంకార్, అశ్విన్, భూపాల్, సామ్రాట్, విజె సన్నీ ప్లేయర్స్ గా పాల్గొన్నారు. ఇక ఈ T20 మ్యాచ్ లో మన స్టార్స్ విజయం సాధించారు. అక్కడ ట్రోఫీ గెలుచుకున్న ఫోటోలను తరుణ్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Also read : Sundeep Kishan : ఆ సినిమాని సందీప్ కిషన్‌తో చేయడానికి.. సందీప్ రెడ్డి వంగ ప్లాన్ చేశాడట..

ఇక CCC మ్యాచ్ ని గెలిచిన తెలుగు స్టార్స్.. నెక్స్ట్ CCL మ్యాచ్స్ కి సిద్ధమవుతున్నారు. 2024 సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 10వ సీజన్ ఫిబ్రవరి 23న ప్రారంభం కాబోతోంది. ఇక ఈ మ్యాచ్స్ షార్జాలో జరగబోతున్నాయి. ఈ సీజన్ లో 8 సినీ ఇండస్ట్రీల నుండి 8 టీమ్ లు పాల్గొంటున్నాయి. బెంగాల్ టైగర్స్, చెన్నై రైనోస్, కర్నాటక బుల్డోజర్స్, కేరళ స్ట్రైకర్స్, ముంబయి హీరోస్, తెలుగు వారియర్స్, పంజాబ్ డీ షేర్స్, భోజ్‌పురి దబాంగ్స్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో తలపడబోతున్నాయి.

మొదటి మ్యాచ్‌ ముంబయి హీరోస్ అండ్ కేరళ స్ట్రైకర్స్ కి మధ్య జరగబోతుంది. కాగా ఇప్పటివరకు జరిగిన CCL సీజన్స్ లో తెలుగు వారియర్స్ నాలుగుసార్లు విజేతగా నిలిచి ట్రోఫీ లిస్టులో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. గత ఏడాది సీజన్ లో కూడా తెలుగు హీరోలే విజేతలుగా నిలిచారు. మరి ఈ ఏడాది ఏం జరుగుతుందో చూడాలి. కాగా తెలుగు వారియర్స్ కి అక్కినేని అఖిల్ కెప్టెన్ చేస్తుంటే సచిన్ జోషి యజమానిగా వ్యవహరిస్తున్నారు.