Tollywood comedian Brahmanandam Mothers Day special art gone viral
Brahmanandam Mothers Day : ఈరోజు (మే 14) మదర్స్ డే కావడంతో ప్రతి ఒక్కరు అమ్మ పై తమ ప్రేమని చాటుకున్నారు. అమ్మ ప్రేమకి సెలబ్రేటిస్ కూడా కరిగి పోవాల్సిందే. ఈ క్రమంలోనే టాలీవుడ్ లోని పలువురు స్టార్స్ తమ అమ్మ ప్రేమని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక హాస్యబ్రహ్మ బ్రహ్మానందం కూడా తన తల్లి ప్రేమని ఎంతో అద్భుతంగా చాటుకున్నాడు. సినిమాల్లో బ్రహ్మి కామెడీ ఎంత బాగా చేస్తాడో పేపర్ పై చిత్రాలను కూడా అంత బాగా గీస్తాడు.
ఆ చిత్రాలను బ్రహ్మి కుమారుడు రాజగౌతమ్ తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తూ అభిమానులతో షేర్ చేస్తుంటాడు. ఇప్పటికే ఎన్నో చిత్రాలను చెక్కిన బ్రహ్మానందం.. మదర్స్ డే సందర్భంగా తన తల్లి చిత్రాన్ని గీసి అదరగొట్టేశాడు. ఆ ఫోటోని కూడా గౌతమ్ షేర్ చేయగా వైరల్ అవుతుంది. కాగా బ్రహ్మానందం ఇటీవల కొంత కాలం సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. ఇప్పుడు మళ్ళీ సినిమాల్లో తరుచుగా కనిపిస్తున్నాడు. ఇక మొన్నటి వరకు తన కామెడీతో అందర్నీ నవ్వించిన బ్రహ్మానందం రంగమార్తాండ సినిమాతో ఏడిపించేశాడు.
Upasana : నేను వారసత్వాన్ని కొనసాగించాలని బిడ్డని కనడం లేదు.. ఉపాసన వైరల్ పోస్ట్!
క్రియేటివ్ డైరెక్టర్ కృషవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కింది. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీలో బ్రహ్మి ఒక ముఖ్య పాత్ర పోషించాడు. ఆ పాత్రలో బ్రహ్మానందం యాక్టింగ్ చూసి ఆడియన్స్ మాత్రమే కాదు, సెలబ్రేటిస్ సైతం ఫిదా అయ్యిపోయారు. చిరంజీవి, రామ్ చరణ్ కుటుంబ సమేతంగా కలిసి బ్రహ్మానందాన్ని సన్మానించారు.