Tollywood Director Anil Ravipudi is really coming into politics
Anil Ravipudi : టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి వరుస విజయాలతో ముందుకు దూసుకుపోతున్నారు. తెలుగు పరిశ్రమలో ఒక ప్లాప్ లేని దర్శకుల లిస్టులో రాజమౌళి తరువాత అనిల్ రావిపూడే ఉన్నారు. డైలాగ్ రైటర్ గా కెరీర్ ని స్టార్ట్ చేసిన అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ‘పటాస్’ సినిమాతో దర్శకుడిగా ప్రయాణం మొదలు పెట్టారు. ఇక అక్కడి నుంచి తీసిన ప్రతి సినిమాతో విజయం అందుకుంటూ వస్తున్నారు. ఇప్పటివరకు ఏడు సినిమాలు తెరకెక్కించగా ఏడు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఆయా హీరోలకు మంచి సినిమాలుగా పేరు తెచ్చుకున్నాయి.
ఈ హీరోల్లో మహేష్ బాబు, వెంకటేష్, బాలకృష్ణ, రవితేజ.. ఇలా స్టార్ హీరోలే ఉన్నారు. రీసెంట్ గా బాలయ్యతో ‘భగవంత్ కేసరి’ సినిమా తెరకెక్కించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. బాలకృష్ణ కెరీర్ లోనే ఈ చిత్రం హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇంతటి హిట్టు అందుకున్న ఈ దర్శకుడు తన తదుపరి సినిమా ఎవరితో చేయబోతున్నారు అని అందరూ ఎదురు చూస్తుంటే.. సడన్ గా ఈ దర్శకుడు నేను రాజకీయ నాయకుడు అవుతాను అంటూ ప్రకటించారు. తాను కూడా ఒక పొలిటికల్ పార్టీ పెట్టబోతున్నట్లు, త్వరలోనే అభ్యర్థులను కూడా వెల్లడిస్తాను అంటూ చెప్పుకొచ్చారు.
Also read : Sapta Sagaralu Dhaati Side B : సప్త సాగరాలు దాటి సైడ్ B రివ్యూ.. హీరో జైలు నుంచి బయటకు వచ్చి ఏం చేశాడు?
అనిల్ రావిపూడి ఏంటి, రాజకీయ నాయకుడు ఏంటి అని అనుకుంటున్నారా..? ఇదంతా ఆహా ఓటీటీలో ప్రసారం కాబోయే కొత్త షో కోసమని తెలుస్తుంది. గతంలో కూడా అనిల్ రావిపూడి ఆహాలో ఒక షోకి న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ఇక ఇప్పుడు మరో షోతో అనిల్ రావిపూడి ముందుకు రాబోతున్నారని తెలుస్తుంది. అయితే దీనికి రాజకీయానికి లింక్ ఏంటి..? అనేదే ఇప్పుడు ప్రశ్నగా మారింది. అసలు ఎలక్షన్స్ టైంలో ఆహా టీం ఏం ప్లాన్ చేస్తుంది..? అని ఆడియన్స్ లో క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది.