Sapta Sagaralu Dhaati Side B : సప్త సాగరాలు దాటి సైడ్ B రివ్యూ.. హీరో జైలు నుంచి బయటకు వచ్చి ఏం చేశాడు?
సప్త సాగరాలు దాటి సైడ్ B కూడా సైడ్ A లాగే స్లో మెలోడీ డ్రామాగా సాగుతుంది. హీరో పెళ్ళైపోయిన తన మాజీ భార్య మీద ప్రేమ చావక తన సంతోషం కోసం ఏం చేశాడు అన్నట్టు మొదటి నుంచి చివరి దాకా సాగుతుంది.

Rakshit Shetty Sapta Sagaralu Dhaati Side B Movie Review and Rating
Sapta Sagaralu Dhaati Side B Review : కన్నడ నటుడు రక్షిత్ శెట్టి(Rakshit Shetty) హీరోగా తెరకెక్కిన కన్నడ సినిమా ‘సప్త సాగరదాచే ఎల్లో’ అక్కడ హిట్ అవ్వగా ఆ తర్వాత తెలుగులో ‘సప్త సాగరాలు దాటి’ అనే పేరుతో రిలీజ్ చేశారు. రెండు పార్టులుగా సైడ్ A, సైడ్ Bగా ఈ సినిమా వచ్చింది. సైడ్ A తెలుగులో సెప్టెంబర్ 22న రిలీజ్ అవ్వగా తాజాగా నేడు నవంబర్ 17న సైడ్ B సౌత్ లో అన్ని భాషల్లో ఒకేసారి రిలీజయింది. హేమంత్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రుక్మిణి వసంత్(Rukmini Vasanth) హీరోయిన్ గా నటించగా సెకండ్ పార్ట్ లో చైత్ర ఆచార్ కూడా నటించింది.
కథ విషయానికి వస్తే.. సప్త సాగరాలు దాటి సైడ్ A లో హీరో ఎవరో చేసిన యాక్సిడెంట్ కేసుని మను(రక్షిత్ శెట్టి) డబ్బుల కోసం ఒప్పుకొని బయటకి వచ్చి ఆ డబ్బులతో ఇల్లు కట్టుకుందామని తన భార్య ప్రియ (రుక్మిణి వసంత్) ఒప్పుకోకపోయినా జైలుకి వెళ్తాడు. కేసు ఇచ్చిన వాళ్ళు చనిపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో మను పదేళ్లు జైలులోనే ఉండి బయటకి వస్తాడు. ఈ లోపు ప్రియ ఇంకో పెళ్లి చేసేసుకుంటుంది. అక్కడితో సైడ్ Aని ముగించగా సైడ్ Bలో మను జైలు నుంచి వచ్చాక ఓ జాబ్ లో జాయిన్ అవుతాడు. తన భార్య జ్ఞాపకాలే గుర్తుకు వస్తుండటంతో తనని వెతుకుతాడు. ప్రియ భర్త బిజినెస్ లో లాస్ అవ్వడంతో తాగుడికి బానిసైపోయి ఇంటిని పట్టించుకోడు. దీంతో ప్రియ కష్టపడుతూ ఇంటిని నడుపుతుంది. తాను ప్రేమించిన అమ్మాయి సంతోషంగా లేదని తెలిసిన మను ఆమెని సంతోషంగా ఉంచడానికి ఏం చేశాడు? వాళ్ళ కష్టాలు ఎలా తీర్చాడు? ఈ ప్రయాణంలో తనకి ఒక వేశ్య దగ్గరవగా ఆమె కోసం ఏం చేశాడు? జైలు నుండి తనని బయటకి తీసుకురాకుండా వదిలేసిన వాళ్ళని మను ఏం చేశాడు? జైలులో తనతో గొడవ పడ్డవాళ్ళు బయట కూడా టార్గెట్ చేయడంతో ఏం చేశాడు అనేది తెరపై చూడాల్సిందే.
Also read : Mangalavaaram Review : మంగళవారం మూవీ రివ్యూ.. RX100 కాంబినేషన్ మరో హిట్ కొట్టిందా?
సినిమా విశ్లేషణ.. సైడ్ B కూడా సైడ్ A లాగే స్లో మెలోడీ డ్రామాగా సాగుతుంది. హీరో పెళ్ళైపోయిన తన మాజీ భార్య మీద ప్రేమ చావక తన సంతోషం కోసం ఏం చేశాడు అన్నట్టు మొదటి నుంచి చివరి దాకా సాగుతుంది. అక్కడక్కడా హీరో పక్కన ఉండే ప్రభు క్యారెక్టర్ తో కామెడీ పండించారు. సాంగ్స్ కూడా పార్ట్ 1 లాగే మెలోడీగా సాగుతాయి. సినిమా చూస్తున్నంతసేపు వీళ్ళ కష్టాలు ఎప్పుడు తీరుతాయిరా బాబు అన్నట్టు అనిపిస్తుంది.
టెక్నికల్ అంశాలకు వస్తే.. మ్యూజిక్, BGM లవ్ ఫీల్ తో మెలోడీగా వినడానికి బాగుంటుంది. కెమెరా విజువల్స్ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు తగ్గట్టు అందంగా చూపించారు.
నటీనటుల విషయానికి వస్తే.. రక్షిత్ శెట్టి పదేళ్ల తర్వాత జైలు నుంచి వచ్చిన వ్యక్తిలా, గుండెల్లో భార్య వెళ్ళిపోయినా తాను సంతోషంగా ఉండాలి అనే బాధలో బాగా నటించాడు. అదే సమయంలో ఇంకో అమ్మాయికి దగ్గరైనా తన ఫీలింగ్స్ ని , ఎమోషన్స్ ని పర్ఫెక్ట్ గా చూపించాడు. పెళ్ళైపోయి ఒక సాధారణ గృహిణి జీవితం గడిపేస్తున్న పాత్రలో రుక్మిణి వసంత్ సాధారణ గృహిణిలా మెప్పించింది. ఇక వేశ్య పాత్రలో చైత్ర ఆచార్ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. వేశ్యకి కూడా ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉంటాయని దర్శకుడు రాసుకున్న దానిని చైత్ర బాగా పండించింది. గోపాల్ దేశపాండే, హీరోయిన్ భర్త పాత్ర, నెగిటివ్ రోల్ లో శరత్ లోహిత్సవ కూడా మెప్పిస్తారు.
మొత్తంగా సప్త సాగరాలు దాటి సైడ్ B సినిమా.. సైడ్ Aకి కొనసాగింపుగా తన మాజీ భార్య సంతోషం కోసం తనకి తెలియకుండా హీరో ఏం చేసాడనేదే కథాంశం. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ రివ్యూ, రేటింగ్ విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.