Mangalavaaram Review : మంగళవారం మూవీ రివ్యూ.. RX100 కాంబినేషన్ మరో హిట్ కొట్టిందా?
అజయ్ భూపతి(Ajay Bhupathi) దర్శకత్వంలో పాయల్ రాజ్‌పుత్(Payal Rajput) ముఖ్య పాత్రలో తెరకెక్కిన సినిమా ‘మంగళవారం’. టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై రిలీజ్ కి ముందు మంచి అంచనాలు నెలకొల్పారు.

Payal Rajput Ajay Bhupathi Mangalavaaram Movie Review and Rating
Mangalavaaram Movie Review : డైరెక్టర్ అజయ్ భూపతి(Ajay Bhupathi) దర్శకత్వంలో పాయల్ రాజ్‌పుత్(Payal Rajput) ముఖ్య పాత్రలో తెరకెక్కిన సినిమా ‘మంగళవారం’. ముద్ర మీడియా వర్క్స్ బ్యానర్ పై స్వాతిరెడ్డి, సురేష్ వర్మ ఈ సినిమాని నిర్మించారు. టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై రిలీజ్ కి ముందు మంచి అంచనాలు నెలకొల్పారు. ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ నేడు నవంబర్ 17న రిలీజ్ అయింది.
కథ విషయానికొస్తే..
మొదట ఒక ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య మంచి స్నేహం చూపిస్తారు. ఓ అగ్నిప్రమాదంలో ఆ అబ్బాయి చనిపోతాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఊళ్ళో ప్రతి మంగళవారం ఊళ్ళోవాళ్ళ అక్రమ సంబంధాల గురించి గోడల మీద రాసి వాళ్ళని చంపేస్తూ ఉంటారు. దీంతో ఆ హత్యలు ఎవరు చేస్తున్నారని పోలీసులు, ఊరి జనం వెతకడం మొదలుపెడతారు. అలా ఓ మంగళవారం ఊరి జనాలకు ఒకరు, ఇంకో మంగళవారం పోలీసులకు ఒకరు దొరుకుతారు. మరి ఈ హత్యలు చేసేది వీళ్లేనా? అసలు గోడ మీద ఎందుకు రాసి చంపుతున్నారు? శైలజ(పాయల్ రాజ్ పుత్)కి ఆ హత్యలకు ఏమన్నా సంబంధం ఉందా? ఆ చిన్నప్పటి పిల్లలు ఏమయ్యారు అనేది తెరపై చూడాల్సిందే.
సినిమా విశ్లేషణ..
మొదటి హాఫ్ అంతా ఊళ్ళో జనాలతో కామెడీ, ఈ హత్యలు, అవి ఎవరు చేశారు అని అంతా ఆలోచించడంతోనే సాగిపోతుంది. ఫస్ట్ హాఫ్ చాలా తొందరగా ముగించేసి ఇంటర్వెల్ దగ్గర హీరోయిన్ ఎంట్రీ ఇస్తారు. హీరోయిన్ ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇంటర్వెల్ దాకా హీరోయిన్ ని చూపించకపోవడం అంటే గ్రేట్ అనే చెప్పొచ్చు. ఇక సెకండ్ హాఫ్ అంతా హీరోయిన్ కథేంటి? ఆ హత్యలు ఎవరు చేస్తున్నారు అనేది సాగుతుంది. మర్డర్స్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఇంకో పాయింట్ కూడా పెట్టి సినిమాపై ఆసక్తి కలిగించారు. ఇక సినిమా అంతా హారర్ థ్రిల్లర్ గా భయపెట్టడానికి కెమెరా షాట్స్, మ్యూజిక్ ని వాడుకున్నాడు దర్శకుడు. కానీ భయపడాల్సినంత అయితే ఏమి లేదు. క్లైమాక్స్ ట్విస్ట్ లు బాగుంటాయి. ఇక పార్ట్ 2కి కూడా లీడ్ ఇచ్చి వదిలేశాడు దర్శకుడు.
టెక్నికల్ అంశాలకు వస్తే..
కెమెరా విజువల్స్ అదిరిపోయాయి. 1980 నేపథ్యంలో పల్లెటూళ్ళో జరిగిన కథ కావడంతో అప్పటి విజువల్స్ వచ్చేలా చక్కగా చూపించారు. ఇక ప్రేక్షకులని భయపెట్టడానికి మాములు సీన్స్ నే కొత్త కొత్త కెమెరా షాట్స్ తో చూపించడానికి ట్రై చేశారు. సంగీతం కూడా కొత్తగా ఇచ్చి భయపెట్టడానికి ట్రై చేశారు. కాంతార సినిమా సంగీత దర్శకుడు అజనీష్ లోక్ నాథ్ ఈ సినిమాకు సంగీతం అందించారు. BGM అయితే చాలా సీన్స్ లో అదిరిపోతుంది. పల్లెటూరి వాతావరం చాలా పక్కాగా చూపించారు. ఆర్ట్ వర్క్ అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది.
నటీనటుల విషయానికొస్తే..
RX100 కి మించిన పర్ఫార్మెన్స్ పాయల్ రాజ్‌పుత్ ఈ సినిమాలో చేసిందనే చెప్పొచ్చు. అందులో నెగిటివ్ క్యారెక్టర్ అయితే ఈ సినిమాలో పూర్తిగా రివర్స్ క్యారెక్టర్ చేసి ప్రేక్షకులని మెప్పించింది. జమిందార్ గా నటించిన చైతన్య, పోలీసాఫీసర్ గా నందిత శ్వేతా, రవీంద్ర విజయ్, అజ్మల్ తమ పాత్రలలో ఒదిగిపోయారు. క్లైమాక్స్ లో ఓ స్టార్ నటుడు గెస్ట్ అప్పీరెన్స్ ఉంటుంది. అతని సీన్స్ అన్ని చాలా బాగుంటాయి. అజయ్ ఘోష్, పక్కన ఓ గుడ్డి వాడ్ని పెట్టుకొని ఇద్దరూ చేసే కామెడీ ప్రేక్షకులని అక్కడక్కడా నవ్విస్తుంది. డైరెక్టర్ అజయ్ భూపతి ఊర్లో ఉండే అన్ని క్యారెక్టర్స్ కి తగిన ప్రాధాన్యత ఇచ్చి అందర్నీ సమంగా చూస్తూ వారి దగ్గర్నుండి మంచి అవుట్ పుట్ తెప్పించుకున్నాడు.
Also Read : ‘మై నేమ్ ఈజ్ శృతి’ మూవీ రివ్యూ.. స్కిన్ మాఫియా నేపథ్యంలో థ్రిల్లర్‌తో వచ్చిన హన్సిక..
మొత్తంగా మంగళవారం సినిమా మర్డర్స్ మిస్టరీలతో సాగే థ్రిల్లర్ సినిమా.. ప్రేక్షకులని భయపెట్టడానికి ట్రై చేస్తూనే ఓ కొత్త పాయింట్ ని చూపించింది. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ, రేటింగ్ విశ్లేషకుడు వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.